E-Paper
Advertisement

ఓయూ పరిధిలో భారీ స్కామ్? ఏకంగా 117 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు!

ఓయూ పరిధిలో భారీ స్కామ్? ఏకంగా 117 ప్రైవేట్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు!
Advertisement

Osmania University: స్వేచ్ఛ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అవసరమైన అనుమతులు, ధృవపత్రాలు లేకుండానే కొన్ని కళాశాలలు కొనసాగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనలను పాటించని 117 ప్రైవేట్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కార్పస్ ఫండ్, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ), సొసైటీకి సంబంధించిన భూమి పత్రాలు వంటి కీలక ధృవపత్రాలు సమర్పించకుండానే కొన్ని కళాశాలలు గత నాలుగేళ్లుగా అనుమతులు పొందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన పత్రాలు అందుబాటులో లేకపోయినా ఆయా కళాశాలలకు అనుమతులు ఎలా లభించాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

117 ప్రైవేట్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు

Advertisement

ఈ వ్యవహారానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి పలువురి నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు. కాగా నిబంధనలు అతిక్రమించినట్లుగా గుర్తించిన 117 ప్రైవేట్ కళాశాలలకు షోకాజ్ నోటీసులు పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిర్దేశిత పత్రాలు ఎందుకు సమర్పించలేదో, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఎలా పొందారో వివరణ కోరనున్నట్లు తెలుస్తోంది. కళాశాలల యాజమాన్యాలు సమర్పించే వివరణలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు పొందినట్లు తేలితే సంబంధిత కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైన ధృవపత్రాలు లేకుండానే అనుమతులు పొందిన వ్యవహారంలో బాధ్యులపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. కేవలం నోటీసులతో సరిపెట్టకుండా, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

ఒక్కో కాలేజీకి రూ.20 లక్షల జరిమానా?

Advertisement

నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే ఒక్కో కళాశాలకు కనీసం రూ.20 లక్షల చొప్పున జరిమానా విధించాలని పలువురు పట్టుబడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన విద్యాసంస్థల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. 117 కళాశాలలకు నోటీసులు జారీ అయితే వాటి యాజమాన్యాలు ఎలాంటి వివరణ ఇస్తాయి? నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే యూనివర్సిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనుమతుల జారీలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా పరిశీలిస్తారా? అన్న అంశాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలాఉండగా నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు పొందిన కాలేజీలకు ఓయూ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయడాన్ని క్రైస్తవ జనసమితి సంఘం అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ స్వాగతించారు.

రూ.23.4 కోట్ల జరిమానా విధించాలని డిమాండ్

నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు సమాచారంతో కాలేజీలు గుర్తింపు తీసుకోవడం వర్సిటీని మోసం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఒక ప్రైవేట్ కళాశాలలకు రూ.20 లక్షల చొప్పున జరిమానా విధించారని, అలాగే ఇప్పుడు కూడా ఈ 117 కళాశాలలకు జరిమానా విధించాలని కోరారు. అలా విధిస్తే.. రూ.23 కోట్ల 40 లక్షలు వర్సిటీకి సమాకూరే అవకాశం ఉందన్నారు. గతంలో సీజేఎస్ పోరాటంతో ప్రైవేట్ కళాశాలలకు దాదాపు రూ.30 లక్షలకు పైగా జరిమానాలు వేసిన ఉదంతాలు ఉన్నాయని ప్రేమ్ గుర్తుచేశారు. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు నోటీసులు జారీచేయడంపై ఓయూ వీసీ, రిజిస్ట్రార్ కు ప్రేమ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: అల్వాల్‌ జానకీనగర్‌లో భారీ చోరీ.. 29 తులాల బంగారం, నగదు అపహరణ!

Tags

Related News

కేటీఆర్ ముందే కార్యకర్తలపై మల్లారెడ్డి ఆగ్రహం.. ముఖం పగలగొడతా అంటూ..

అల్వాల్‌ జానకీనగర్‌లో భారీ చోరీ.. 29 తులాల బంగారం, నగదు అపహరణ!

మల్కారం క్వారీలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎల్ నినో యాక్షన్ ప్లాన్.. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం!

సీఎం రేవంత్ రెడ్డికి కవిత సంచలన లేఖ.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు డిమాండ్!

ఏపీలో ‘మురసు’ ముసురు.. కుమ్మేస్తున్న వర్షాలు, తీర ప్రాంతాలకు అలర్ట్, తెలంగాణలో కూడా

చౌటుప్పల్‌లో అర్ధరాత్రి దారుణం.. జోగిని దారుణ హత్య.. భారీగా బంగారం, నగదు దోపిడీ!

Big Stories

Advertisement
×