కారం కారంగా, పుల్లపుల్లగా ఉండే నిల్వ పచ్చళ్ళు, ఊరగాయలు అంటే తెలుగువారికి ఎంతో ఇష్టం. ఏ కూర పెట్టినా పక్కన ఒక నిల్వ పచ్చడి ఉండాల్సిందే. ఆ పచ్చడితో రెండు ముద్దలు తిన్నాకే భోజనాన్ని మొదలు పెడతారు. అయితే ఇలా ఊరగాయలు తినే విషయంలో కొంతమందిలో ఒక అభిప్రాయం ఉంది. ఎక్కువగా ఊరగాయలు తినేవారికి రొమ్ముల పరిమాణం పెరుగుతాయని చెప్పుకుంటారు. దీనివల్ల ఎంతోమంది వాటిని తినాలన్నా భయపడుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రొమ్ముల పరిమాణానికి కారణం ఇది
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం రొమ్ముల పరిమాణం అనేది జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులపై ఆధారపడి ఉంటుంది. ఏ స్త్రీ రొమ్ము అభివృద్ధి అయినా కూడా ఆమె శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోనే ప్రభావితం చేస్తుంది. అయితే ఆహారము, ఆమె జీవనశైలి కూడా రొమ్ముల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కానీ నిల్వ పచ్చళ్ళు, ఊరగాయలు తినడం వల్ల రొమ్ములు పరిమాణం పెరుగుతాయని చెప్పడం మాత్రం పూర్తిగా తప్పు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
ఉప్పు వల్లే సమస్యలు
కూరగాయలలో, నిల్వ పచ్చళ్లలో సాధారణంగా ఉప్పు అధికంగా ఉంటుంది. అంటే సోడియం ఎక్కువగా ఉంటుంది. ఆ సోడియాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిలిచిపోయే అవకాశం ఎక్కువ. దీనివల్ల శరీరం కొద్దిగా ఉబ్బినట్టు కనిపిస్తుంది. బరువు కూడా పెరుగుతారు. అయితే ఈ బరువు కొవ్వు వల్ల వచ్చినది కాదు. కేవలం నీటి వల్ల పెరిగినది. శరీర బరువు పెరిగినప్పుడు కొన్నిసార్లు రొమ్ము పరిమాణంలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. దాని ఆ రొమ్ముల పెరుగుదలకు ఊరగాయలు తినడం వల్లే పెరిగాయని అనుకోవడం పూర్తిగా తప్పు. అది మళ్ళీ కొన్ని రోజులకే లేదా కొన్ని గంటల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తాయి.
క్యాబేజీ, వెల్లుల్లి, కాలీఫ్లవర్ వంటి కూరగాయలతో కూడా ఎన్నో రకాల కూరగాయలను తయారు చేస్తారు. ఈ ఊరగాయలను అధికంగా తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు. బరువు పెరుగుతున్నారంటే రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతాయి. కాబట్టి నిల్వ పచ్చళ్ళు, ఊరగాయలను తక్కువ మొత్తంలోనే తినాలి. లేకుంటే శరీరంలో సోడియం అధికంగా చేరిపోతుంది. ఇది మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.
రొమ్ముల సైజు గురించి ఆదర్శవంతమైన ప్రామాణికం ఇంతవరకు లేదు. ఇది పూర్తిగా స్త్రీ శరీరం, ఎత్తు పై ఆధారపడి ఉంటుంది. జన్యు శాస్త్రం పై కూడా ఆధారపడి ఉంటుంది. శరీర రూపానికి తగ్గట్టు రొమ్ముల పరిమాణం పరిపూర్ణంగా, సమతుల్యంగా కనిపిస్తే చాలు. రొమ్ముల పరిమాణం గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.