Kaushal Manda:కౌశల్ మండా (Kaushal Manda).. మోడల్గా కెరియర్ ను ఆరంభించి, ఆ తర్వాత టెలివిజన్ నటుడిగా, సినిమా నటుడిగా, వ్యాపార ప్రకటనలతో కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు చిత్ర దర్శకుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు. అనేక సినిమాలలో నటించిన ఈయన ‘ద లుక్స్ ప్రొడక్షన్’ అనే మోడల్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి వ్యవస్థాపకుడిగా.. సీఈవోగా కూడా పని చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో సుమారు 230 వాణిజ్య ప్రకటనలను రూపొందించి సంచలనం సృష్టించారు. 1983లో వచ్చిన సీరియల్ ‘ఎవ్వని చెదనుంచు’ అనే సీరియల్లో బాలనటుడిగా కీలకపాత్ర పోషించిన ఈయన.. ఆ తర్వాత ‘చక్రవాకం’ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించారు ఇక డాన్స్ బేబీ డాన్స్ షోలో అతిథిగా కూడా కొనసాగారు. ప్రస్తుతం జీ తెలుగులో సూర్యవంశం సీరియల్ లో ప్రధాన పాత్రధారుడిగా నటిస్తున్నారు.
హీరో ఎదగకుండా తొక్కేశారు – కౌశల్
ఇదిలా ఉండగా తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ మండా తనను హీరోగా ఎదగనివ్వకుండా తొక్కేశారు అంటూ తెలిపారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. ఇంటర్వ్యూలో భాగంగా..” మీరు సినిమాలలో హీరోగా అవకాశం అందుకున్నప్పుడు, ఒక హీరో ఆ చిత్ర దర్శకులతో మాట్లాడి మీకు అవకాశాలు లేకుండా చేశారని వార్తలు వినిపిస్తున్నాయ..నిజమేనా?” అని ప్రశ్నించగా.. ఏమో నిజం కావచ్చేమో అంటూ బదులిచ్చారు కౌశల్ మండా.
నా వెనుక పెద్ద కుట్ర జరిగింది – కౌశల్
ఇంటర్వ్యూలో భాగంగా కౌశల్ మాట్లాడుతూ.. “మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు. మనం ఉన్నది మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి.. ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వడానికి.. వచ్చిన సక్సెస్ను జీవితాంతం నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాము. మన వెనుకాల ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలియనప్పుడు.. వారి గురించి మనం మాట్లాడకూడదు. అయితే నన్ను ఇండస్ట్రీలో ఎదగకుండా.. హీరోగా అవకాశాలు లేకుండా చేయాలని ఒక స్టార్ హీరో చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ హీరో పేరు బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా నాకు ఎటువంటి సమస్య లేదు. రాత ఉంటే ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా అది మన వద్దకే వస్తుంది. ఒకరకంగా చెప్పాలి అంటే నాకు అవకాశాలు రాకుండా నా వెనుక పెద్ద కుట్ర చేసినా.. నాకు రాసి పెట్టింది ఏది నన్ను కాదని పక్కకు పోలేదు” అంటూ తెలిపారు.
ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాను – కౌశల్
ఇకపోతే కౌశల్ మండా మాట్లాడుతూ.. నా వల్ల చాలామంది హీరో హీరోయిన్లు ఒక స్టేజ్ కి చేరుకున్నారు. ముఖ్యంగా ఎక్కడైనా అవకాశం ఉంది అంటే కచ్చితంగా నేను కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తాను. అలా ఇప్పటికే నేను సహాయం చేసిన ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారు. అలాగే జబర్దస్త్ లోకి రష్మీకి అవకాశం ఇప్పించింది కూడా నేనే.. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు అంటూ కూడా తెలిపారు కౌశల్. కౌశల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Film industry: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత భార్య కన్నుమూత!