BigTV English

Tea and Coffee Habits: కాఫీ, టీలకు ఆ శక్తి ఉందా? నిజంగానే ఆ మహమ్మారిని అడ్డుకుంటుందా? తాజా అధ్యయనం ఏం చెప్పింది?

Tea and Coffee Habits: కాఫీ, టీలకు ఆ శక్తి ఉందా? నిజంగానే ఆ మహమ్మారిని అడ్డుకుంటుందా? తాజా అధ్యయనం ఏం చెప్పింది?

ఉదయం, సాయంత్రం రెండుసార్లు పొట్టలో టీ లేదా కాఫీ పడితేనే పనిచేసే వారు ఎంతోమంది. టీ కాఫీలు ఒక వ్యక్తిలో ఉత్సాహాన్ని నింపుతాయి. వారిలో ప్రోడక్టివిటీని కూడా పెంచుతాయని అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు మరొక అధ్యాయం కాఫీ లేదా టీ తాగడం వల్ల వారికి భవిష్యత్తులో తలా, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలిసింది. అలాగే నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ కూడా వచ్చే ముప్పు తగ్గిపోతుంది అని వివరించింది. దీన్నిబట్టి టీ కాఫీ తాగేవారు సంతోషంగా వాటిని ఆస్వాదించవచ్చు.


ప్రపంచం మొత్తం మీదే ప్రసిద్ధ పానీయాలు టీ లేదా కాఫీ. కొన్నిచోట్ల టీ తాగితే కొన్నిచోట్ల కాఫీని అమితంగా తాగుతారు. ప్రపంచంలో అత్యధికంగా తాగుతున్న పానీయాలు ఈ రెండే. రోజుకి రెండు మూడు సార్లు కాఫీలు లేదా టీ తాగనిదే పనిచేయని వారు కూడా ఎక్కువే. ఇప్పుడు వారికి ఇది శుభవార్తలా అనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా ఇలా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. తలా, మెడ క్యాన్సర్ ప్రపంచంలో అత్యధికంగా వస్తున్న క్యాన్సర్లలో ఏడో స్థానంలో ఉన్నాయి. తక్కువ ఆదాయ దేశాల్లో ఈ క్యాన్సర్ అధికంగా వస్తున్నట్టు గుర్తించారు. అయితే కాఫీ టీ వినియోగం వల్ల క్యాన్సర్ తగ్గుతుందా లేదా పెరుగుతుందా అనే విషయాన్ని తేల్చడానికి అధ్యయనాన్ని నిర్వహించారు.


ఈ అధ్యయనంలో భాగంగా 9548 మంది క్యాన్సర్ రోగులను, 15783 మంది క్యాన్సర్ లేని వ్యక్తులను పరిశోధించారు. అలాగే 14 అధ్యయనాల డేటాను కూడా విశ్లేషించారు. వీరిలో కాఫీలు తాగని వారు, టీలు తాగని వారు… అలాగే టీ కాఫీలు తాగే వారు అందరూ ఉన్నారు. అందరి ఆరోగ్య డేటాను తీసుకున్నాక.. చివరికి ఫలితాలను విడుదల చేశారు.

ప్రతిరోజూ నాలుగు కప్పులు కంటే ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులకు తలా మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 17 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధనలు చెప్పాయి. నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30% తగ్గినట్టు, గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 22 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. ఇంకా ఆశ్చర్యంగా ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు కప్పులు కాఫీ తాగేవారికి హైపో ఫారంజియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 41 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇది గొంతు దిగువన సంభవించే ఒక రకమైన క్యాన్సర్. అలాగే కెఫిన్ లేని బ్లాక్ కాఫీ తాగడం వల్ల కూడా లాభాలు ఉన్నట్టు అధ్యయనం గుర్తించింది.

ఇక టీ విషయానికి వస్తే టీ తాగే వారు లో కూడా మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 9% తగ్గుతున్నట్టు, హైపో ఫారంజియల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే ప్రతిరోజూ ఒకటికంటే ఎక్కువ కప్పుల టీ తాగితే మాత్రం స్వర పేటిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 38% ఎక్కువగా ఉన్నట్టు తేలింది. కాబట్టి కాఫీ, టీ లను మితంగా తాగడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది. అలాగే క్యాన్సర్ ను అదుపులో ఉంచే అవకాశం కూడా ఉంది.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×