తొక్కిసలాటకు కారణమైన బాధ్యులపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలని రోజా డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు అంటూ.. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. గేమ్ ఛేంజర్ మీద ఉన్న శ్రద్ధ భక్తుల మీదా లేదా అంటూ రోజా ఫైర్ అయ్యారు.
కాగ.. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటుచేసిన టోకెన్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. మరో 48 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అస్వస్థతకు గురైనవారిని స్విమ్స్, రుయా హాస్పిటల్స్‌కు తరలించారు. కాగా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి 32 మందిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు.
మిగతా 16 మంది స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. స్విమ్స్ అత్యవసర విభాగంలో 8 మందికి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మెరుగైన చికిత్స కోసం రుయా నుంచి స్విమ్స్‌కు 8 మందిని తరలించారు. ప్రస్తుతం రుయాలో 24 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, వైజాగ్‌కు చెందిన రజిని, లావణ్య, బళ్లారికి చెందిన నిర్మల, సేలంకు చెందిన మల్లిగ మృతిచెందారు.
Also Read: ఘటన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు సందర్శన.. ఈవోపై ప్రశ్నల మీద ప్రశ్నలు
ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నంలో.. ఊపిరాడక పలువురు భక్తులు కిందపడిపోయారు. పోలీసులు వెంటనే CPR చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. బైరాగిపట్టెడలో ఏర్పాటుచేసిన టోకెన్ కేంద్ర వద్ద ఘటన జరిగింది.