Game Changer : మెగా అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ (Ram Charan) ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న గేమ్ చేంజింగ్ మూమెంట్ మరికొన్ని గంటల్లో రాబోతోంది. జనవరి 10న రామ్ చరణ్ పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) థియేటర్లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు బ్రేక్ చేసేలా దూసుకెళ్తోంది. గంట వ్యవధిలోనే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడు కావడం విశేషం.
అడ్వాన్స్ బుకింగ్స్ హవా
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి గంటలోనే కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కాగా, కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా
ప్రస్తుతం ఇండియా వైడ్ ఈ సినిమాకు 9000 షోస్ షెడ్యూల్ అవ్వగా, వాటి నుండి సుమారుగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. ఇక ఇండియాలోనే ఈ సినిమా బుకింగ్స్ 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి బుక్ మై షోలో గడచిన గంటలోనే 36, 720 టిక్కెట్లు అమ్ముడు కావడం సంచలనంగా మారింది. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 58 కోట్లు దాటిందని టాక్ నడుస్తోంది.
ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
సమాచారం ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అడ్వాన్స్ బుకింగ్స్ హవా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా ఒక్క తెలుగు వర్షన్ కి సంబంధించి 58, 899 టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. అంటే దాదాపు 2.6 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ జరిగాయి తెలుగు వెర్షన్ కి సంబంధించి. ఇక ఓవర్సీస్ లో కూడా ఇదే జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఓవర్సీస్ లో 651k డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్ అమ్మకాలు నమోదైనట్టు సమాచారం. మరోవైపు కర్ణాటకలో కూడా సింగిల్ స్క్రీన్ లలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయని తెలుస్తోంది.
ఓపెనింగ్స్ లో ‘పుష్ప’రాజ్ రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమాకి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా, కొన్ని గంటల వ్యవధిలోనే రెండున్నర లక్షల టికెట్లు అమ్ముడు అయ్యాయి. ఈ మూవీ మొదటి రోజే 63.29 కోట్ల ఓపెనింగ్ రాబట్టి, రికార్డులను బ్రేక్ చేసింది. అంతకు ముందు ‘కల్కి 2898 ఏడీ’ మూవీ మొదటి రోజు 38 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గత ఏడాది రిలీజైన మరో పాన్ ఇండియా మూవీ ‘దేవర’ మూవీ 54 కోట్లకు పైగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టి, ‘కల్కి’ రికార్డును గల్లంతు చేసింది. ఆ తరువాత ‘పుష్ప’రాజ్ ఆ ప్లేస్ ను ఆక్రమించాడు. మరి ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దూసుకెళ్తున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ‘పుష్ప 2’ రికార్డును బ్రేక్ చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.