E-Paper
Advertisement

Breast Cancer: రోజంతా బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందా?

Breast Cancer: రోజంతా బ్రా ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందా?
Advertisement

రోజంతా బ్రా వేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే భావన ఎక్కువ మంది మహిళల్లో ఉంది. ఉద్యోగాలు చేసే మహిళలు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. అయితే వైద్యులు మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. వైద్య పరిశోధనల ప్రకారం బ్రా ధరించడం మాత్రమే రొమ్ము క్యాన్సర్‌కు కారణం అనే స్పష్టమైన ఆధారాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. బిగుతుగా ఉండే బ్రా వేసుకోవడం వల్ల రొమ్ములకు రక్త ప్రసరణ ఆగిపోతుందని, విషపదార్థాలు శరీరంలో నిల్వ ఉండిపోతాయని అంటారు. కానీ ఈ వాదనలకు శాస్త్రీయ ఆధారం ఇంతవరకు లభించలేదు. క్యాన్సర్ అనేది కణాల అసాధారణ పెరుగుదల వల్ల వచ్చే వ్యాధి. దీనికి ప్రధానంగా జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, జీవనశైలి కారణాలు పాత్ర పోషిస్తాయి.

ఈ ఇబ్బందులు తప్పవు
చాలా బిగుతుగా ఉండే బ్రా ఎక్కువసేపు ధరించడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఉన్న చర్మంపై ఒత్తిడి పెరగడం, చెమట పట్టడం, దురద రావడం, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో చర్మ ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ఇవి తాత్కాలిక సమస్యలే గానీ క్యాన్సర్‌కు నేరుగా కారణమవ్వవు. సరైన సైజు లేని బ్రా వల్ల శరీరానికి ఇబ్బంది కలగడం సహజం.

Advertisement

వీటి వల్లే రొమ్ము క్యాన్సర్
రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కొంతమంది అధికంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్ చరిత్ర ఉండటం, హార్మోన్ల అసమతుల్యత, పొగతాగడం, మద్యం సేవించడం, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ కూడా ఈ ప్రమాదం ఎక్కువవుతుంది. ఇవన్నీ శరీరంలో జరిగే అంతర్గత మార్పులకు సంబంధించి ఉంటాయి. కేవలం ధరించే దుస్తుల వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడం సరైనది కాదు అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Raw Cabbage: పచ్చి క్యాబేజీ తినడం అంత ప్రమాదకరమా? తింటే ఏమవుతుంది?

Advertisement

అయితే మహిళలు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి సరిపోయే సైజు బ్రా ఎంచుకోవాలి. చాలా బిగుతుగా ఉండే బ్రాలను రోజంతా ధరించడం మంచిది కాదు. ఇంట్లో ఉన్న సమయంలో వీలైతే బ్రా లేకుండా ఉండటం మంచిది. శుభ్రత పాటించడం, చెమట ఎక్కువగా పట్టే రోజుల్లో లో దుస్తులు మార్చుకోవడం వంటివి చేయాలి. ముఖ్యంగా నెలకు ఒకసారి స్వయంగా రొమ్ముల పరీక్ష చేసుకోవాలి. చేతికి ఏదైనా గడ్డ, నొప్పి వంటివి అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఎక్కువ కాలం పాటు బ్రా ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందనే భావనకు శాస్త్రీయ ఆధారం లేదు. అనవసర భయాలు పెట్టుకోకుండా మహిళలు ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారానే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Related News

కొత్త డేటింగ్ ట్రెండ్.. ప్రేమలో అనుబంధం తగ్గితే బ్రేకప్ చేయకుండా మంకీ బ్రాంచింగ్

దీపావళికి టపాసులు కాలుస్తూ గాయపడ్డారా? కాలిన గాయలకు వెంటనే ఇలా చేయండి

పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

టైం లేనప్పుడు..ఈ టేస్టీ కిచిడిని ట్రై చేయండి!రుచి అదిరిపోతుంది

రుచికరమైన సేమ్యా పాయసం..ఈ కొలతలతో చేస్తే చల్లారినా గట్టిపడదు

చాణక్య నీతి.. భర్తలు చేసే ఈ 5 తప్పులు వల్లే వైవాహిక జీవితం నాశనం

షుగర్ పేషెంట్లకు దీపావళి డైట్ ప్లాన్.. ఏవి తినాలి? ఏవి తినకూడదు?

దీపావళి రాత్రి గుడ్లగూబ కనిపిస్తే అదృష్టం పట్టినట్లే.. ఈ సంకేతాలు శుభసూచకం

Big Stories

Advertisement
×