E-Paper
Advertisement

Eko Movie OTT : తెలుగులోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Eko Movie OTT : తెలుగులోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Eko Movie OTT : ఈ మధ్య మలయాళంలో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న స్టోరీ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. చిన్న కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.. గత రెండేళ్లుగా మాలయాళంలో రిలీజ్ అయిన ప్రతి మూవీ తెలుగులో డబ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఆ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి.. తాజాగా ఓ మలయాళ చిత్రం తెలుగులోకి వచ్చేస్తుంది.. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం..

ఎకో ఓటీటీ డీటెయిల్స్…

ఉత్కంఠను రేకెత్తించే ఒక అద్భుతమైన థ్రిల్లర్ మూవీ కోసం వెతుకుతున్నట్లయితే ఇది పర్ఫెక్ట్ మూవీ.. మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎకో’ డిసెంబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు దేనాజిత్ అయ్యతన్ అద్భుతంగా రూపొందించారు. కేవలం కథా బలంతోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.. అయితే ఇప్పటివరకు ఈ సినిమా తెలుగులో రాలేదు.. ప్రస్తుతం తెలుగులోకి కూడా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఫైనల్ గా ఈ సినిమా ఈ రోజు నుంచి తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇదే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది.. మలయాళం లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి..

Also Read : ‘అఖండ 2’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..?

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు జనాలు ఈ మధ్య ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం మలయాళ ఇండస్ట్రీ నుంచి బోలెడు సినిమాలు పలకరిస్తున్నాయి. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే.. 2025 డిసెంబర్ లో వచ్చిన సినిమాలు జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి. అలా థియేటర్ లోకి వచ్చి మంచి రికార్డులను సొంతం చేసుకున్న సినిమాలలో మలయాళ మూవీ ఎకో ఒకటి.. కర్ణాటక, కేరళ సరిహద్దులోని ఒక ప్రశాంతమైన, పొగమంచుతో నిండిన పట్టణం చుట్టూ తిరుగుతుంది. ప్రాంతంలో ఒక ఎస్టేట్ యజమాని అదృశ్యం అవుతాడు. అయితే అతను ఎలా మాయమైపోయాడు అన్నది సస్పెన్స్ గా మారిపోయింది.. ఆ ఎస్టేట్ చుట్టూ ఎన్నో చీకటి రహస్యాలు దాగి ఉన్నాయని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. ఐదేళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి కోసం అతని భార్య మరియు కొందరు వ్యక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. మోహన్ అనే వ్యాపారవేత్త ఈ కథలోకి ప్రవేశించి, స్థానికులు మాట్లాడటానికి భయపడే నిజాలను వెలికితీసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఏదైనా అపాయం కలుగుతుందా? చివరికి అతను ఆ ఎస్టేట్ యొక్క చీకటి రహస్యాన్ని చేదిస్తాడా అన్నది తెలియాలంటే ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. థియేటర్లలో మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఈ మూవీ ఇక ఇక్కడ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×