BigTV English

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసు ఫిర్యాదు.. కేసు నమోదు

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పోలీసు ఫిర్యాదు.. కేసు నమోదు

MLA Padi Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అదనపు ఎస్పీ రవి చందన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు ఫైల్
అయింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని ఏఎస్పీ రవి చందన్ కంప్లైంట్ ఇచ్చారు. తాను విధులు నిర్వర్తిస్తుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనకు ఆటంకం కలిగించారని
ఆరోపించారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు బీఎన్ఎస్ యాక్ట్ 132, 351(3) ప్రకారం కేసు నమోదు చేశారు.


రెండు రోజులుగా రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హైటెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య పచ్చగడ్డి వేస్తే
భగ్గుమనే రేంజ్‌లో చాలెంజ్‌లు, కౌంటర్ చాలెంజ్‌లు విసురుకోవడమే కాదు.. ఈ రోజు దాదాపు భౌతిక దాడుల వరకు పరిస్థితులు వెళ్లాయి. తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని,
కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని అరికెపూడి గాంధీ ముందు రోజు స్పష్టం చేశారు. కానీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఆయన వ్యాఖ్యలను విశ్వసించక ఆయనకు బీఆర్ఎస్ పార్టీ
కండువా కప్పుతానని, గురువారం ఉదయం 11 గంటలకు ఆయన నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురేస్తానని చెప్పారు. ఈ సవాల్‌పై అరికెపూడి గాంధీ ఫైర్
అయ్యారు.

దమ్ముంటే రా అంటూనే.. ఒక వేళ పాడి కౌశిక్ రాకుంటే మధ్యాహ్నం 12 గంటలకు తానే పాడి ఇంటికి వెళ్లుతానని ప్రతి సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో పోలీసులు
ఆయనను గృహనిర్బంధం చేశారు. అరికెపూడి గాంధీ సవాల్ కారణంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ముందు జాగ్రత్తగా బారికేడ్లు అడ్డు పెట్టారు. కానీ, అరికెపూడి అనుచరులు బారికేడ్లను
తప్పించుకుని గోడ దూకి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిలోకి వెళ్లారు. అక్కడ ఉభయ నేతల అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. టమాటలు, గుడ్లు, పూలకుండిలతో దాడులు చేసుకున్నారు.
పోలీసులు వెంటనే అరికెపూడి గాంధీని నార్సింగ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.. ఈ వ్యవహారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పాడి కౌశిక్ ఇంటికి వచ్చారు.


Also Read: Sitaram Yechury: ఇందిరా గాంధీతో రాజీనామా చేయించిన సీతారాం ఏచూరి.. మరిన్ని ఆసక్తికర విషయాలివే!

బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకా ఇతర నేతలు అంతా కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లారు. తనపై హత్యాయత్నం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు
చేశారు కౌశిక్ రెడ్డి. అయితే, సైబరాబాద్ కమిషనరేట్ వద్ద పోలీసులపై దౌర్జన్యానికి దిగారు ఆయన. ఎమ్మెల్యేలను మాత్రమే లోనికి అనుమతిస్తామని పోలీసులు చెప్పటంతో కౌశిక్ రెడ్డి
వారికి వేలు చూపిస్తూ రెచ్చిపోయారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని నెట్టేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. హరీష్ రావు వారించబోయినా పట్టించుకోకుండా పోలీసులపై జులుం
ప్రదర్శించారు. కౌశిక్ రెడ్డి వ్యవహర శైలిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ఈ ఘటన పైనే పోలీసు అధికారి ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×