BigTV English

Healthy Drinks: ఈ డ్రింక్స్‌తో జీర్ణ సమస్యలు మాయం

Healthy Drinks: ఈ డ్రింక్స్‌తో జీర్ణ సమస్యలు మాయం

Healthy Drinks: వర్షాకాలం ఆహ్లాదంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం అవసరం. వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల అనేక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు చాలా వరకు పెరుగుతాయి. పెరిగిన తేమ, హానికరమైన బ్యాక్టీరియాల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో మం తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆహారం, నీరు పరిశుభ్రంగా ఉంటే అనారోగ్య సమస్యలు నుంచి బయట పడవచ్చు. వర్షాకాలంలో వచ్చే గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంతో పాటు మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని పానీయాలు మీకు ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గ్యాస్ట్రిక్ సమస్యలు..
గ్యాస్ట్రిక్ సమస్య నుంచి సురక్షితంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. అందుకే మనం తినడానికి ముందు సబ్బు నీటితో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. బ్యాక్టీరియా వైరస్‌ సంక్రమణలను దీని ద్వారా తగ్గించవచ్చు. అంతే కాకుండా వర్షా కాలంలో వంటల్లో ఉపయోగించే కూరగాయలు, పండ్లను తినడానికి ముందు వాటిని బాగా కడగాలి. ఇవే కాకుండా పరిశుభ్రమైన నీటి వల్ల జీర్ణ సమస్యలు తగ్గించుకోవచ్చు. వర్షా కాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. ఇది జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.

హెర్బల్ టీ:
మనలో చాలామంది టీ, కాఫీలతోనే రోజును ప్రారంభిస్తారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు హాని కలుగుతుంది. అంతేకాకుండా మూలికా ఔషధ గుణాలున్న వాటిని తీసుకోవడం, అల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అల్లంలో జీర్ణ ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. పొట్టలో రసాల ఉత్పత్తిని ప్రేరేపించడంలో ఇది సహాయపడుతుంది. అంతే కాకుండా అనేక రకాల జీర్ణ సమస్యలను రాకుండా చేస్తుంది. నిమ్మరసం తాగడం వల్ల కూడా జీర్ణక్రియకు మేలు జరుగుతుంది.


మజ్జిగ:
మజ్జిగ, పెరుగు మొదలైనవి పేగుల్లో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటిలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది ప్రసిద్ధ భారతీయ పానీయంగా చెబుతారు. సరైన జీర్ణక్రియను నిర్వహించడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరానికి ఇది పోషణను అందించడంతో పాటు హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. రెగ్యులర్‌గా మజ్జిగను తాగటం వల్ల అజీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

Also Read: ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..

పసుపు, పుదీనా నీరు:
పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా పేగు కదలికలు, కడుపునొప్పి, విరేచనాలను తగ్గించడంతో పాటు పేగు సమస్యను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నీటిలో పసుపు కలిపి తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×