Drumstick Benefits: మునగకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మునగ కాయ తినడం మంచిది. వేసవి కాలం వచ్చేసరికి మన శరీరానికి తాజాదనం, పోషకాల అవసరం పెరుగుతుంది. ఈ సీజన్‌లో, రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మురుగు పరిచే కూరగాయలను తినాలి.
వేసవిలో అనేక రకాల కూరగాయలు లభిస్తాయి. వాటిలో ప్రధానమైన కూరగాయలలో ఒకటి మునగకాయ, దీనిని ‘మోరింగ’ అని కూడా పిలుస్తారు. ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో మునగ సహాయపడుతుంది. అంతే కాకుండా పోషకాలతో కూడా ఇది సమృద్ధిగా ఉంటుంది. ఇందులో లెక్కలేనన్ని విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మరి మునగకాయ మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఎలాంటి లాభాలుంటాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మునగకాయలో లభించే పోషకాలు :
సమ్మర్ లో హైడ్రేటెడ్ గా, తాజాగా ఉంచే కొన్ని ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. మునగకాయ వేసవిలో తినదగిన ఒక ముఖ్యమైన కూరగాయ. ఇది మెగ్నీషియం ,ఇనుము వంటి ఖనిజాలతో సహా అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఇది అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.
మునగ కాయలను మీరు కూరలు, సూప్‌లు, సలాడ్‌లు, జ్యూస్‌లు, స్మూతీలు లేదా ఊరగాయలు వంటి వివిధ రూపాల్లో తినవచ్చు.
మునగ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:
మునగకాయ రసం తాగడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. ఈ రసంలో విటమిన్ సి, విటమిన్ ఎ (బీటా-కెరోటిన్), విటమిన్ కె, , అనేక బి విటమిన్లు (బి1, బి2, బి3, బి6, మరియు ఫోలేట్) ఉంటాయి.
మునగకాయలో మంచి మొత్తంలో ఫైబర్ ,విటమిన్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. విటమిన్ బి12, థియామిన్ , నియాసిన్ జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. తద్వారా జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.
మునగకాయలో బయో యాక్టివ్ సమ్మేళనాలు , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మునగలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది ఉబ్బసం , శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
మునగకాయలో లభించే ప్రోటీన్ కొల్లాజెన్ చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా మొటిమలు, వీటి వల్ల వచ్చే మచ్చలను తగ్గిస్తుంది.
మునగకాయ శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఇది శరీరంలోని నిర్విషీకరణ ప్రక్రియను ప్రోత్సహించడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. జన్మలో జుట్టు రాలదు !
మునగ ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మధుమేహాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.
మునగకాయలో అధిక నీటి శాతం ఉంటుంది. ఇది శరీరంలో సరైన హైడ్రేషన్‌ను నిర్వహిస్తుంది. అంతే కాకుండా మునగకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి.