BigTV English

Early Morning Blurry Vision: ఉదయం నిద్రలేవగానే మసకబారుతున్న కళ్లు.. ఎందుకో తెలుసా?

Early Morning Blurry Vision: చాలామందికి కంటిచూపు ఉదయం నిద్రలేవగానే కాసేపు మసకబారుతున్నట్లుగా ఉంటుంది. అలాగే మరికొందరికి ఎప్పుడు నిద్రపోయి లేచినా కూడా సరిగా కళ్లు కనిపించడం లేనట్లు ఫీలవుతూ ఉంటారు. ఈ లక్షణాలుకు కంటి వైద్యులు కొన్ని కారణాలు చెబుతున్నారు.

Early Morning Blurry Vision: ఉదయం నిద్రలేవగానే మసకబారుతున్న కళ్లు.. ఎందుకో తెలుసా?

Early Morning Blurry Vision : చాలామందికి కంటిచూపు ఉదయం నిద్రలేవగానే కాసేపు మసకబారుతున్నట్లుగా ఉంటుంది. అలాగే మరికొందరికి ఎప్పుడు నిద్రపోయి లేచినా కూడా సరిగా కళ్లు కనిపించడం లేనట్లు ఫీలవుతూ ఉంటారు. ఈ లక్షణాలుకు కంటి వైద్యులు కొన్ని కారణాలు చెబుతున్నారు.


ఉదయం కంటి చూపు మసకబారడానికి కారణాలు :


కళ్లపై ఒత్తిడి కలిగేలా ముఖం పెట్టి పడుకోవడం:
కొందరు నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకుని ముఖాన్ని తలగడలోకి పెట్టేసుకుంటారు. అలాంటప్పుడు ముఖంపైనే కాదు కళ్లపై కూడా ఒత్తిడి కలుగుతుంది. ఇది కూడా ఉదయం కళ్లు మసకబారడానికి ఒక కారణం.

కళ్లు పొడిబారడం:
మనషుల కళ్లలో ఉండే నీరు ఎప్పుడూ కళ్లను కాపాడుతూ ఉంటాయి. నిద్రపోయే సమయంలో ఒక్కోసారి కంట్లోకి కన్నీళ్లు ఊరక పొడి బారిపోతాయి. అందువల్ల లేచిన తర్వాత కాసేపటి వరకు చూపు మందగించినట్లుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో నిద్ర లేచిన తరువాత కాసేపు కను రెప్పలు మూసి తెరుస్తూ ఉంటూ పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుంది.

రక్తంలో చక్కెర స్థాయిలో మార్పు :
మనిషి రక్తంలో చక్కెర స్థాయి మరీ ఎక్కువగా పెరిగినా లేదా మరీ తగ్గినా ఉదయాన్నే చూపు మందగించినట్లుగా ఉంటుంది. ఈ లక్షణాల ఉన్నవారికి కాస్త బలహీనత ఉంటుంది.. అలాంటప్పుడు మధుమేహ వైద్యులను సంప్రదించడం మంచిది.

రాత్రి పడుకునే ముందు వేసుకునే మందుల ప్రభావం :
వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రి నిద్రపోయే మందు రోజూ మాత్రలు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా బీపీ గోలీలు, జలుబు మాత్రలు, నిద్ర మాత్రలు లాంటివి రాత్రిపూట తీసుకోవడం వల్ల కళ్లలో నీరు ఊరడంపై ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి వారిలో కూడా ఉదయాన్నే చూపు మసక మసకగా ఉంటుంది.

కంటి అలర్జీ ఉంటే :
కళ్లకు సంబంధించి ఏవైనా అలర్జీలు కలిగినప్పుడు కంట్లో దురదగా ఉండడం, కళ్లు వాయడం, పొడి బారడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఉదయం పూట కొంత సమయంపాటు కళ్లు సరిగ్గా కనిపించడంలేనట్లు ఉంటుంది.

కాంటాక్ట్‌ లెన్సులతో పడుకోవడం :
కొందరు కంటి చూపు సమస్య ఉన్నవారు కళ్ల జోడుకు బదులుగా కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తారు. ఈ లెన్సులు కళ్లలో పెట్టుకుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు వీటిని తీసేసి నిద్రపోవాలి. కొన్ని సందర్భాలలో ఎవరైనా కంట్లో ఉన్న లెన్సులను తీయకుండా మరిచిపోయి పడుకుంటే ఉదయం నిద్రలేవగానే కంటి చూపు ఇబ్బందికరంగా ఉంటుంది.

నూనె గ్రంథులు:
కళ్ల చుట్టు పక్కల ఉండే నూనె గ్రంథులు కొన్నిసార్లు నిద్ర పోతున్నప్పుడు కొంత నూనె, నీటిని ఉత్పత్తి చేస్తాయి. అలాంటప్పుడు కంటికి ఇరిటేషన్‌, దృష్టి మసకబారడం లాగా అనిపిస్తుంది.

రాత్రి మద్యపానం చేయడం:
నిద్రపోయేముందు చాలా మందికి మద్యం సేవించడం అలవాటుగా ఉంటుంది. అలా రాత్రి తాగి పడుకుంటే.. శరీరంలో డిహైడ్రైషన్ సమస్య, కళ్లు పొడిబారే సమస్య ఉంటుంది. దీంతో నిద్ర లేవగానే కాసేపు సరిగా కనిపించదు.

పై కారణాలు గమనించి.. సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×