Coconut Flower: కొబ్బరి నీళ్లతో కలిగే ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొబ్బరి నీళ్లు, కొబ్బరి తింటుంటాము. అయితే, ఇటీవల మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు కూడా అమ్ముతున్నారు. ప్రజలు కూడా వీటిని ఎగబడి కొంటున్నారు. కొబ్బరి పువ్వులో కూడా పుష్కలమైన ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కరిగే చక్కెరలు కూడా ఉన్నాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుందని చెబుతున్నారు.
వాస్తవానికి కొబ్బరి కాయలోని నీళ్ళు ఇంకిపోయి, కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతుంది. అయితే కొబ్బరినీళ్లు, కొబ్బరి కంటే కూడా ఎక్కువ పోషకాలు కొబ్బరి పువ్వులోనే ఉంటాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాంటి కొబ్బరి పువ్వును ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. కొబ్బరి పువ్వు తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలోనూ, ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడంలోనూ కొబ్బరి పువ్వు సూపర్‌గా సహాయపడుతుంది.
అంతేకాకుండా కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. అలాగే కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే దీనిలోని కాల్షియం మరియు విటమిన్ కె అధికంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాకుండా కొబ్బరి పువ్వులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిలోని కొవ్వు ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి.
కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది జుట్టును బలంగానూ, నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పువ్వు చర్మం ముడతలు, చిన్న మచ్చలు, నల్ల మచ్చలను నివారిస్తుంది, సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పిస్తుంది.
Also Read: నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా?.. డిప్రెషన్ నుంచి విముక్తి కోసం ఇలా చేయండి
కొబ్బరి పువ్వు తినడం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి సహాయపడుతుంది, మూత్రపిండాలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు తినడం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పువ్వును మిస్ చేసుకోకుండా తీసుకోవాలి. అంతేకాకుండా కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. దీనిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.
కొబ్బరి పువ్వును పచ్చిగా లేదా వండిన ఆహారంలో ఉపయోగించవచ్చు. కొబ్బరి పువ్వును మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.