Mumaith khan:ముమైత్ ఖాన్ (Mumaith khan).. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాటతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది. ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె అప్పట్లో చాలా సినిమాలలో నర్తించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే సడన్గా వెండితెరకు దూరమైన ఈమె.. బిగ్ బాస్(Bigg Boss) షోలో పాల్గొని మళ్లీ మాయమైంది. ఇక ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న ‘కాకమ్మ కథలు’ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇక అంతేకాదు హైదరాబాదులో విలైక్ అనే అకాడమీని కూడా స్థాపించింది ఈ ముద్దుగుమ్మ. దీని ద్వారా మేకప్ కు సంబంధించిన కోర్సులను యువతకు నేర్పిస్తోంది కూడా.
కోమాలోకి వెళ్లిపోయిన ముమైత్ ఖాన్..
ఇకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమై.. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైన ఈమె తాజాగా ప్రముఖ హీరోయిన్ తేజస్వి మదివాడ (Tejaswi madiwada) నిర్వహిస్తున్న షో ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఊహించని విషయాలను అభిమానులతో పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ.. ముమైత్ ఎంత బాధ అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. తన మెదడులో ఏడు ఎనిమిది వైర్లు ఉన్నాయి అని చెప్పగానే.. అందుకు ముమైత్ మాట్లాడుతూ.. “షూ లేస్ కట్టుకోవడం కూడా ప్రమాదమే అని నాకు డాక్టర్ చెప్పారు. అయినా సరే నేను బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వెళ్లాను. అప్పుడే నేను నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt)కి కూడా చెప్పాను. రేపు ఉదయం నేను లేవకపోతే నా పని అయిపోయినట్లే అని అర్థం చేసుకోమని చెప్పాను. అంత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ఇక నా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు సుమారుగా రెండు సంవత్సరాల సమయం పట్టింది అంటూ తెలిపింది ముమైత్ ఖాన్.
ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే అసలు సమస్య..
తాను ఇలా చెప్పడానికి అసలు కారణం ఏమిటి..? తనకు ఎలాంటి అనారోగ్య సమస్య చుట్టుముట్టింది..? అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది. ముమైత్ ఖాన్ మాట్లాడుతూ..” నేను ఒకరోజు మా ఇంట్లోనే కాలుజారి కింద పడిపోయాను. ఆ సమయంలో నా తల మంచం అంచులకు బలంగా తగిలింది. కానీ పైకి ఎటువంటి గాయం కనిపించకపోవడంతో ఆసుపత్రికి వెళ్లలేదు. కానీ తలనొప్పి మాత్రం తీవ్రమవడంతో ఆసుపత్రికి వెళ్లాను. మూడు రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని డాక్టర్లు గుర్తించి, వెంటనే నాకు ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు నేను కోమాలోనే ఉండిపోయాను. ఆ తర్వాతే ఆ గాయం నుంచి కోలుకున్నాను” అంటూ ముమైత్ ఖాన్ తెలిపింది. ఏది ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే మామూలు విషయం కాదు. అందులోనూ మెదడుకు అంతర్గత బ్లీడింగ్ అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటిగా ఉంది అని, మళ్ళీ అభిమానులకు వూరట కలిగించేలా మాట్లాడారు ముమైత్ ఖాన్. ఏది ఏమైనా గతంలో ఈమె పడిన కష్టం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతే కాదు ఇప్పుడు సినిమాలలో అవకాశాలు అందుకోవాలని కూడా కోరుకుంటున్నారు.