BigTV English
Advertisement

Cucumber: కీర దోసకాయను ఈ ఆహారాలతో కలిపి తినొద్దు.. తర్వాత మీరే బాధపడతారు

Cucumber: కీర దోసకాయను ఈ ఆహారాలతో కలిపి తినొద్దు.. తర్వాత మీరే బాధపడతారు

ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో కీరా దోసకాయ ముందు స్థానంలో ఉంటుంది. వేసవిలో వీటిని అధికంగా తింటారు. వీటి అమ్మకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనిలో 90 శాతం నీరే ఉంటుంది. కాబట్టి వేసవిలో కీరా దోసకాయ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అధికంగానే ఉంటాయి. అయితే కీరా దోసకాయను సలాడ్ల రూపంలో, సాండ్‌విచ్‌లో భాగంగా చేసుకుంటారు. ఎక్కువమంది కొన్ని రకాల ఆహారాలతో కీరాదోసను కలపడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఆహారాలతో కీరా దోసతో కలపకూడదు తెలుసుకోండి.


పెరుగు
చాలామంది పెరుగులో కీరా దోస ముక్కలు వేసుకుని తినేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వేసవిలో చల్లని పెరుగులోకి ముక్కలు వేసుకుని తింటే ఎంతో హాయిగా ఉంటుంది. నిజానికి ఈ రెండింటినీ ఆరోగ్యకరం కాదు. దోసకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది పెరుగును నీరుగా మార్చడానికి కారణం అవుతుంది. పెరుగుకు ఉండే మృదువైన క్రీమీ ఆకృతి దెబ్బతింటుంది. కాబట్టి పాల ఉత్పత్తుల్లో దోసకాయను జతచేసి తినకూడదు. మీకు ఏదైనా పెరుగులో వేసుకుని తినాలనిపిస్తే ఓట్స్, బెర్రీలు వంటివి వేసుకొని తినడం ఉత్తమం.

టమోటో
ఎంతోమంది చెర్రీ, టమోటోలు, కీరా దోసకాయను సలాడ్లో వేసుకొని కలిపి తింటూ ఉంటారు. దోసకాయలు నీటిని విడుదల చేస్తాయి. టమోటోలా రుచిని ఇది మార్చేస్తుంది. దోసకాయలో స్వల్పంగా చేదు ఉంటుంది. ఇది టమాటోలోని రుచితో కలిసి విచిత్రమైన రుచిని అందిస్తుంది. ఇది మంచి ఆహార కాంబినేషన్ కూడా కాదు. టమోటోలను దోసకాయతో కాకుండా బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు వంటి వాటితో కలిపి తింటే ఆరోగ్యకరం.


మాంసాహారాలు
కీరా దోసకాయను మాంసాహారాల్లో కలిపి తినకూడదు. కీరా దోసకాయ తేలికగా ఉంటుంది. కీరా దోసకాయ రుచి, ఆకృతి మాంసంతో విభేదిస్తాయి. దోసకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి కాల్చిన లేదా వండిన మాంసాలతో చేసినప్పుడు అది తడి తడిగా అయిపోతుంది, తినాలనిపించదు కూడా. మీకు మాంసంతో తినాలనిపిస్తే కాల్చిన బంగాళదుంపలను లేదా వేయించిన ఆకుకూరలను కలుపుకొని తినండి.

వెల్లుల్లి
వెల్లుల్లిలో బలమైన ఘాటైన రుచి ఉంటుంది. చాలామంది దోసకాయలు, వెల్లుల్లి తరుగు కలిపి తింటూ ఉంటారు. అలాగే వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే. అయినా దోసకాయతో కలిస్తే అది అంత ఆరోగ్య ప్రయోజనాలను అందించకపోవచ్చు. కాబట్టి వెల్లుల్లి దోసకాయను విడివిడిగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. వీటిని కలిపి తినే ప్రయత్నం చేయవద్దు.

పుల్లని పండ్లు
పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అంటారు. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు వేసవిలో అధికంగానే దొరుకుతాయి. వీటిని దోసకాయలతో తినడానికి ప్రయత్నించవద్దు. సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం ఉంటుంది. ఇది దోసకాయ రుచిని అధిగమిస్తుంది. దీనివల్ల అదొక రకమైన పుల్లని వాసన రుచి వస్తుంది. అధిక ఆమ్లత్వం దోసకాయల ఆకృతిని, రుచిని చెడగొడుతుంది. కాబట్టి ఈ రెండింటిని విడివిడిగా తినడమే అన్ని విధాలా మంచిది.

Related News

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

Pink Salt Benefits: పింక్ సాల్ట్‌ కోసం ఎగబడుతున్న జనం.. ఎందుకో తెలిస్తే మీరూ కొంటారు!

Big Stories

×