Siddipet News: అమ్మా అనే పిలుపుతో ఆడజన్మ సార్ధకం అని భావిస్తుంది. మాతృత్వం అనేది స్త్రీకి పెద్దవరం. అమ్మా అనే పులుపుతో స్త్రీ మూర్తికి గౌరవం దక్కుతుంది. దంపతులు తల్లిదండ్రులు అయ్యే రోజు కోసం ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా సంతానం కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ దంపతులకు బంపర్ ఆఫ్ తగిలింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకేసారి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ అరుదైన ఘటన సంగారెడ్డి జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నాగరత్న, నర్శింహులకు ఎనిమిది ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లై ఇన్నేళ్లవుతున్నప్పటికీ వారికి పిల్లలు లేకపోవడంతో వివిధ ఆసుపత్రులలో చూపించుకున్నారు. అయిన సంతానం లేకపోవడంతో వారు తీవ్ర మనోవేదన చెందారు.
అయితే నాగరత్నం, నర్శింహులు ఐవీఎఫ్ విధానం ద్వారా పిల్లలు పుడతారని తెలుసుకుని ఓ ఆస్పుత్రిలో చికిత్స తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం నాగరత్నం గర్భం దాల్చింది. అనంతరం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో వైద్య సహాయం పొందారు. అప్పటి నుంచి వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ.. ఆరోగ్య పరీక్షలు చేయించుంకుంది.
Also Read: లైఫ్ సైన్సెస్ హబ్ గా హైదరాబాద్, బయో ఏషియా -2025 ఈవెంట్ లో సీఎం రేవంత్
ఈ నేపథ్యంలో సోమవారం నాడు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి చికిత్స అందించారు. నాగరత్నంకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టిందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి కుటుంబంలో ఆనందానికి హద్దులే లేవు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరిటెండెడ్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ.. గద్వేల్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. నాగరత్నం, నర్శింహులకు పెళ్లై ఎనిమిదేళ్లకు సంతానం కలగడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ముగ్గురు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.