Telugu Movie : ఒక సినిమా నిర్మాణం జరుగుతుంది అంటే… రీ షూట్స్ చాలా కామన్ విషయం. అయితే.. లోకేషన్స్ సెట్ అవ్వకపోతే, కథ, కథనంలో తేడాలు రావడం, యాక్టర్స్ ఫర్మామెన్స్‌పై అనుమానాలు ఉంటే ఆ రీ షూట్స్ అనేవి జరుగుతాయి. కానీ, ఓ తెలుగు మూవీ మాత్రం ఇప్పుడు కాస్ట్యూమ్ బాలేవని రీషూట్స్ చేశారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు కోటి 50 లక్షల వరకు భారం పడిందట. ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసే అంశం ఏంటంటే… ఈ రీ షూట్స్.. 1.50 లక్షలు ఎక్కువ ఖర్చు చేయడం అనేవి ఏవీ కూడా నిర్మాతకు తెలియదట.
అనవసరంగా రీ షూట్స్ చేసుకున్న ఈ మూవీ ఏంటి..?
ఆ రీ షూట్స్‌కి కారణం ఎవరు..?
కోటి 50 లక్షలు ఎక్కువ ఖర్చు చేసిన ఆ నిర్మాత ఎవరు..?
నిర్మాతకు తెలియకుండానే… ఈ వ్యవహారాన్ని నడిపింది ఎవరు..?
అనేవి ఇప్పుడు చూద్దాం…
తెలుగులో ఓ సినిమా రూపొందుకుంటుంది. దీన్నీ ఓ డెబ్యూ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తుంది. దాదాపు 10 – 12 ఏళ్ల పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేసి ఈ మూవీతో మెగా ఫోన్ పట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే గత కొద్ది రోజుల క్రితం ఈ మూవీ రీ షూట్స్ పెట్టుకుందట. ఈ రీ షూట్స్ పెట్టడానికి కారణం తెలిసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది.
12 రోజుల పాటు రీ షూట్స్..?
సినిమాలో కాస్ట్యూమ్ బాగరాలేదని రీ షూట్ చేశారట. ఈ రీ షూట్స్ ఒక్క రోజు కాదు.. ఏకంగా 12 రోజుల పాటు జరిగాయని తెలుస్తుంది. కేవలం కాస్ట్యూమ్స్ బాగలేవని 12 రోజుల పాటు మళ్లీ షూట్ చేయడం ఏంటి అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో సాగుతుంది.
కోటి 50 లక్షల భారం…?
ఈ 12 రోజుల రీ షూట్స్ కి ప్రతి రోజు 10 నుంచి 12 లక్షల వరకు ఖర్చు అయిందట. అంటే… కేవలం ఈ రీ షూట్స్ వల్ల నిర్మాతలకు దాదాపు కోటి 50 లక్షలు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ భారీ బడ్జెట్ కేటాయించారట. ఇప్పుడు ఈ రీ షూట్స్ వల్ల అధనపు భారం పడుతుంది అనే ఆలోచన కూడా వాళ్లకు వచ్చినట్టు సమచారం.
నిర్మాతకు చెప్పకుండానే…?
ఈ రీ షూట్స్ అనేవి నిర్మాతకు చెప్పకుండానే చేశారు అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక సినిమా చేస్తున్నారంటే… సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం నిర్మాతకు తెలుస్తుంది. కానీ, ఇక్కడ మాత్రం… 10 నుంచి 12 రోజుల పాటు రీ షూట్స్. ప్రతి రోజు 10 నుంచి 12 లక్షల వరకు ఖర్చు. మొత్తంగా ఈ రీ షూట్స్ వల్ల కోటి 50 లక్షలు అదనపు భారం అయినా… నిర్మాతకు ఎందుకు చెప్పలేదు… అనేది మాత్రం తెలియదు.
హీరోకు నచ్చకపోవడం వల్లే..?
కొన్నీ సీన్స్ షూట్ అయ్యాకా… హీరో అవుట్ పుట్ చూశాడట. ఆయన లుక్‌తో పాటు సినిమాలో కొన్ని నచ్చలేదట. ముఖ్యంగా కస్ట్యూమ్స్ హీరోగారికి అసలు నచ్చలేదట. దీంతో రీ షూట్స్ పెట్టాల్సిందేనని పట్టు పట్టారట. దీంతో చేసేదేమీ లేక అధనంగా కోటి 50 లక్షల బడ్జెట్ పెట్టి రీ షూట్స్ చేసినట్టు సమాచారం.
స్టార్ కస్ట్యూమ్ డిజైనరే ఇప్పుడు డైరెక్టర్
ఇప్పుడు ఈ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నవాళ్లు… గతంలో స్టార్ కస్టూమ్ డిజైనర్. స్టార్ హీరోల సినిమాలకు కూడా వాళ్లు వర్క్ చేశారు. అలాంటి వాళ్లు తన మూవీకి కస్ట్యూమ్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ, జస్ట్ హీరోకు నచ్చలేదు అని తీసిన ఫుటేజ్ ను మొత్తం చెత్త బుట్టలో పడేసి… కోటి 50 లక్షలు ఖర్చు చేసి.. అది కూడా నిర్మాతకు తెలియకుండా.. రీ షూట్స్ చేయడం అంటే…. ఇండస్ట్రీ జనాలను నిజంగానే ఆశ్చర్యపరుస్తుంది.
కథలో కూడా కొత్తధనం లేదు…
ఇంత వ్యవహారం నడిపిన ఈ మూవీకి స్టోరీ కూడా అంతంత మాత్రమే ఉందని తెలుస్తుంది. హీరోకు లవర్‌తో పెళ్లి అవుతుందంట. అయితే ఆ హీరోయిన్‌కు పిల్లలు పుట్టరట. దీంతో మరో హీరోయిన్‌తో హీరో రహాస్యంగా ప్రేమాయణం సాగిస్తాడట. దీంతో ఆ గర్ల్ ఫ్రెండ్ కి హీరో వల్ల పిల్లలు పుడుతారట. గర్ల్ ఫ్రెండ్ కి పిల్లలు పుట్టిన తర్వాత… భార్యకు కూడా పుడుతారట. అయితే ఈ విషయం అందరికీ తెలిసినా… తెలియనట్టు ఉంటారట. ఈ విషయం తెలుసు కదా అని అనుకుంటారట.
ఈ కథ బయటికి తెలిసిన తర్వాత ఇలాంటి కథతో సినిమా హిట్ అవుతుందా…? దీని కోసం కస్ట్యూమ్స్ బాలేదు అని రీ షూట్స్ చేసి కోటి 50 లక్షలు అదనపు భారం అయ్యేలా చేశారా అని అంటున్నారు.