Facts About Eggs: కోడిగుడ్డు రోజుకు ఒక్కటి తింటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. చాలా మందికి కోడిగుడ్డు అంటే ఇష్టంగా కూడా తింటుంటారు. ముఖ్యంగా వ్యాయామాలు చేసే వారు మాత్రం కోడిగుడ్డును ఎక్కువగా తినడం వల్ల కండరాలు బలంగా ఉంటాయని అంటారు. అందువల్ల పచ్చి గుడ్డును తాగుతుంటారు. ఇక చాలా మంది ఇంట్లో కోడిగుడ్డును వండుకుని తింటుంటారు. కోడిగుడ్డు పులుసు, కూర, ఆమ్లెట్ వంటి రూపాల్లో తింటుంటారు. అయితే ఎలా తిన్నా సరే కానీ గుడ్డును మాత్రం తినాలని అంటారు. ముఖ్యంగా రోజుకు ఒక గుడ్డును తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలి, కండలు పెంచాలనుకునే వారికి కూడా కోడిగుడ్డు ఉపయోగపడుతుంది. అంతేకాదు వీటితో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
ఒక కోడికి గుడ్డును ఉత్పత్తి చేయడానికి దాదాపు 24 నుంచి 26 గంటల టైం పడుతుంది. ఇక గుడ్డు పెంకులను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. గుడ్డులో ఉండే కాల్షియం వంటి ఖనిజాలు మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. కుక్కలు, పక్షులు వంటి పెంపుడు జంతువులకు పెట్టే ఆహారంలోను గుడ్డు పెంకులను ఉపయోగిస్తారు.
ఇక కోడిగుడ్డును జుట్టు, చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. చర్మానికి కోడిగుడ్డు సోనను ఉపయోగించడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. ఇక జుట్టుకు కోడిగుడ్డు చాలా రకాలుగా తోడ్పడుతుంది. కోడిగుడ్డుతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అంతేకాదు జుట్టును మృదువుగా, దృఢంగా ఉంచేందుకు కూడా కోడిగుడ్డు సహాయపడుతుంది.
కోడిగుడ్డును తరచూ తినడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది. కంటి చూపు కూడా మెరుగవుతుంది. శరీరం అనారోగ్యానికి గురైనపుడు కోడిగుడ్డు తినడం వల్ల శక్తిని ఇస్తుంది. క్షయ వ్యాధి గ్రస్తులు, గర్భిణులు, కాలేయ వ్యాధులు, బాలింతలకు కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. నరాల బలహీనతకు కూడా కోడిగుడ్డు ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులోని పచ్చసోనను తినడం మంచిది కాదని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ ట్రైగ్లిజరైడ్ల మోతాదును తగ్గించి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు గుండెకు మంచి కొవ్వును పచ్చసొన ద్వారానే అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.