E-Paper
Advertisement

గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇన్‌ఫెక్షన్ తగ్గించే బెస్ట్ టిప్స్

గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఇన్‌ఫెక్షన్ తగ్గించే బెస్ట్ టిప్స్
Advertisement

Home remedies for sore throat: క్లైమేట్ కొద్దిగా మారినా, ఐస్‌క్రీమ్‌లు లేదా చల్లటి వాటర్ తాగేసినా వెంటనే దాడి చేసే ప్రాబ్లమ్ గొంతు నొప్పి. గొంతులో గరగర, మంట, చిన్న లాలాజలం మింగాలన్నా విపరీతమైన నొప్పి మనల్ని రోజంతా ఇబ్బంది పెడుతుంది. అయితే.. ప్రతి చిన్న ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే టాబ్లెట్లు మింగాల్సిన పనిలేదు. మన వంటింట్లో దొరికే నాచురల్ ఇంగ్రెడియెంట్స్‌తోనే గొంతు ఇన్‌ఫెక్షన్ నుంచి చాలా వేగంగా కోలుకోవచ్చు. అసలు ఆ పవర్‌ఫుల్ ట్రిక్స్ ఏంటో, గొంతును ఎలా రీఛార్జ్ చేయాలో ఇప్పుడు చూద్దాం!

1. సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ (ఉప్పు నీటి పుక్కిలింత):

గొంతు నొప్పి అనగానే అందరికీ గుర్తొచ్చే క్లాసిక్ & మోస్ట్ ఎఫెక్టివ్ ట్రిక్ ఇది. దీని కోసం గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి, రోజుకు 3 నుంచి 4 సార్లు గార్గ్లింగ్ (పుక్కిలించడం) చేయాలి. ఉప్పు నీరు గొంతులోని కణజాలాల వాపును తగ్గించడమే కాకుండా, అక్కడ చేరుకున్న బాక్టీరియా, వైరస్‌లను బయటకు పంపేస్తుంది.

2. అల్లం- తులసి మ్యాజిక్ కషాయం:

Advertisement

కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలకు బదులు ఈ హెర్బల్ డ్రింక్ తాగితే గొంతుకు ఇన్స్టెంట్ రిలీఫ్ లభిస్తుంది. దీని కోసం నీటిలో దంచిన అల్లం ముక్క, నాలుగైదు తులసి ఆకులు వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీనిలో వాడే అల్లంలోని యాంటీ మైక్రోబయల్ గుణాలు, తులసిలోని ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎలిమెంట్స్ గొంతులోని కఫాన్ని కరిగించి ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తాయి.

3. పసుపు పాలు + తేనె:

పసుపును నాచురల్ యాంటీబయోటిక్ అని పిలుస్తారు. ఇది గొంతు ఇన్‌ఫెక్షన్ పై వేగంగా దాడి చేస్తుంది. గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, ఒక స్పూన్ మంచి తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది గొంతు పొడిబారకుండా.. మాయిశ్చరైజ్ చేస్తుంది. రాత్రి వేళ దగ్గు రాకుండా ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.

4. స్టీమ్ ఇన్హేలేషన్ (ఆవిరి పట్టడం):

Advertisement

గొంతు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆవిరి పట్టడం వల్ల శ్వాసకోశ మార్గాలు క్లియర్ అవుతాయి. వేడి నీటిలో కొద్దిగా పసుపు లేదా వాము వేసి, ముసుగు తన్నుకుని 5-10 నిమిషాలు శ్వాస పీల్చుకోవాలి. దీని ద్వారా గొంతులోని డ్రైసెస్ తగ్గి, తేమ అందుతుంది. దీనివల్ల నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.

5. లవంగం & మిరియాల షాట్:

లవంగంలో ఉండే ‘యూజెనాల్’ అనే పదార్థం సహజ సిద్ధమైన పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని మెల్లగా నమలడం లేదా మిరియాల పొడిని కొద్దిగా తేనెతో కలిపి తీసుకోవడం చేయవచ్చు. గొంతు నొప్పి, మంట నుంచి సెకన్లలో ఉపశమనం లభిస్తుంది.

Also Read: రూ.11,500 వేలకే 32 ఇంచుల టీవీ..స్టాక్ అయిపోయేలోపే కొనేయండి

రికవరీ స్పీడప్ అవ్వడానికి లైఫ్‌స్టైల్ టిప్స్:

గొంతు నొప్పి ఉన్నంత కాలం చల్లటి నీళ్లు, ఐస్‌క్రీమ్‌లు, డీప్ ఫ్రై చేసిన జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండండి.

రోజంతా కేవలం గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగుతూ బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి.

గొంతుకు రెస్ట్ ఇవ్వండి. గట్టిగా మాట్లాడటం లేదా ఎక్కువగా అరిచి మాట్లాడటం తగ్గించండి.

గొంతు నొప్పి ప్రారంభంలోనే.. ఈ చిన్న చిన్న లైఫ్ స్టైల్ మార్పులు, కిచెన్ హాక్స్ పాటిస్తే 2-3 రోజుల్లో ..సమస్య మాయమవుతుంది. అయితే, గొంతు నొప్పితో పాటు విపరీతమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వారం రోజులు దాటినా నొప్పి తగ్గకపోతే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Related News

ఒత్తిడి పెరిగితే కడుపులో తిప్పడమేంటి ?స్ట్రెస్, గట్ హెల్త్ సీక్రెట్స్ ఇవే!

రోజంతా ఫోన్ పట్టుకుంటున్నారా? మీ చేతి వేళ్లకు ఈ ముప్పు తప్పదు!

హెయిర్ పర్ఫ్యూమ్, రెగ్యులర్ పర్ఫ్యూమ్ రెండూ ఒకటేనా? రెండింటి మధ్య తేడాలు ఇవే

వర్షాకాలంలో చిక్కులు, పొడిబారే రింగుల జుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? సిల్కీ, స్మూత్ హెయిర్‌ కోసం చిట్కాలు

స్నేహంలో కూడా గోప్యత ముఖ్యం.. బెస్ట్ ఫ్రెండ్‌కైనా ఈ 5 విషయాలు చెప్పకూడదు

ఫేస్ క్రీమ్ లేదా సన్‌స్క్రీన్ ముందుగా ఏది పూసుకోవాలి? చర్మ సంరక్షణ కోసం సరైన విధానం ఇదే

దోమలను చంపేందుకు కొత్త దోమలు.. 6 లక్షల స్పెషల్ దోమలు విడుదల

Big Stories

Advertisement
×