Anchor Sujatha – Boyapati Sreenu: సుజాత ..ఈ పేరు చెబితే గుర్తు పట్టరేమో కాని, తీన్మార్ చంద్రవ్వ అంటే టకీమని గుర్తుపట్టేస్తారు.అచ్చ తెలంగాణా యాసతో ఈమె చేసే యాంకరింగ్ అంతలా అందరిని కట్టి పడేస్తుంది మరి.ఇక ఒకవైపు యాంకర్ గా ప్రోగ్రామ్స్, మరో పక్క మంచి మంచి సినిమాలని సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్న సుజాత క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.ఇక ఇదిలా ఉంటె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రవ్వ పాపులర్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో తనకు జరిగిన ఒక క్రేజీ ఇన్సిడెంట్ ని ఇలా చెప్పుకొచ్చింది.
బోయపాటి నన్ను గుర్తుపట్టలేదు
తనని చంద్రవ్వగా చూసిన బోయపాటి శ్రీనివాస్ తనని ఆఫీసుకు పిలిపించడంతో ఆఫీస్ కి వెళ్లానని,అయితే అక్కడ బోయపాటి నన్ను గుర్తుపట్టలేదని తెలిపింది.ఎదురుగా వెళ్లి నిలబడితే నేను మిమ్మల్ని పిలవలేదు,నేను పిలిచింది తీన్మార్ చంద్రవ్వని అన్నాడని,దానికి ఈ సుజాతనే ఆ తీన్మార్ చంద్రవ్వ అని,అదీ నేనే ఇదీ నేనే అని చెప్పడంతో తను నమ్మలేకపోయాడని అసలు విషయం చెప్పుకొచ్చింది.బాలయ్య బాబు నటించిన అఖండ2 సినిమాలో ఒక చిన్న బాబుకి తల్లిలా చేయాలని అనడంతో చేస్తానని చెప్పానని,కానీ మీరు దానికి అసలేమాత్రం సూట్ కారని చెప్పాడని పేర్కొంది.
also read :పార్ట్-2 ఫీవర్… ‘రాకా’ కూడా అదే దారిలోనా?
అస్సలు ఇష్టముండదు
అయితే ఈ సినిమాలో ఫ్యామిలీలో మంచి రోల్స్ ఉన్నాయి,ఏదైనా చేయండి అంటే నాకు లిప్ స్టిక్ పెట్టుకుని,జెడ నిండా పూలు పెట్టుకుని వెనకాల నిలబడటం అస్సలు ఇష్టముండదని అసలు అలాంటి పాత్రలు నేను చేయను అని చెప్పడంతో బోయపాటి శ్రీనివాస్ ఒక్కసారిగా భళ్ళున నవ్వాడని చెప్పుకొచ్చింది.అసలు ఇప్పటి వరకు తనని ఇలా ఎవరూ అడగలేదని ముందు ముందు ఏమైనా మంచి పాత్రలు ఉంటె చెబుతానని అనడంతో అక్కడి నుండి బయటికి వచ్చానని తెలిపింది.మొత్తానికి యాంకరింగ్ చేస్తూ నవ్వించే చంద్రవ్వ నిజంగానూ అలాగే ఉంటుందేమో అని బోయపాటి మోసపోయాడన్నమాట.
ఎక్కడైనా తళుక్కుమంటుందో !
బోయపాటి విషయానికి వస్తే అఖండ2 తో మునుపటి మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయిన ఈ మాస్ డైరెక్టర్ ఇపుడు బాలీవుడ్ బాట పడుతున్నాడని ఒకసారి లేదు లేదు నాగ చైతన్యతో సినిమా చేస్తున్నాడంటూ ఇబ్బడి ముబ్బడిగా రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి కాని ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్ డేట్ రాని పరిస్థితి.
also read :రుక్మిణి వసంత్ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా ?
ఇక తీన్మార్ చంద్రవ్వ ఆలియాస్ సుజాత ప్రస్తుతం ఒక పక్క తెలంగాణా యాసలో యాంకరింగ్ చేస్తూ మరో వైపు సుబ్బు బీ పాజిటివ్, ఇడుపు కాయితం వంటి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది.చూడాలి మరి ముందు ముందు అయినా బోయపాటి శ్రీనివాస్ సినిమాల్లో ఎక్కడైనా తళుక్కుమంటుందో !