E-Paper
Advertisement

డ్యాన్స్ చేస్తూ గ్యాంగ్‌స్టర్లను చితగ్గొట్టే అమ్మాయిలు… ఈ థ్రిల్లర్ నెక్స్ట్ లెవెల్

డ్యాన్స్ చేస్తూ గ్యాంగ్‌స్టర్లను చితగ్గొట్టే అమ్మాయిలు… ఈ థ్రిల్లర్ నెక్స్ట్ లెవెల్
Advertisement

Action Thriller: డ్యాన్స్ అంటే కళ… క్రమశిక్షణ… అందమైన ప్రదర్శన. కానీ అదే డ్యాన్స్ ప్రాణాలు కాపాడే ఆయుధంగా మారితే ? చేతిలో తుపాకులు లేవు… కత్తులు లేవు… ఉన్నది కేవలం కొన్నేళ్లుగా నేర్చుకున్న బ్యాలెట్ శిక్షణ మాత్రమే. అదే శిక్షణతో ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లను ఎదుర్కోవాల్సి వస్తే ? ఇలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లరే ‘Pretty Lethal’. ఈ సినిమాలో తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఒక ప్రతిష్టాత్మకమైన బ్యాలెట్ డ్యాన్స్ పోటీలో పాల్గొనేందుకు ఐదుగురు యువ డ్యాన్సర్లు కలిసి ప్రయాణం ప్రారంభిస్తారు. తమ ప్రతిభను ప్రపంచానికి నిరూపించుకోవాలనే కలలతో బయలుదేరిన వారికి ముందున్న ప్రమాదం గురించి మాత్రం ఏమాత్రం అవగాహన ఉండదు. వెళ్తుండగా దారి మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బస్సు అకస్మాత్తుగా ఆగిపోతుంది. మొబైల్ సిగ్నల్ కూడా లేకపోవడంతో సహాయం కోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభిస్తారు. కొంత దూరంలో ఓ పాత విల్లా కనిపించడంతో అక్కడికి వెళ్తారు. బయటకు చూస్తే అది సాధారణ ఇల్లులా కనిపించినా, లోపల మాత్రం భయంకరమైన రహస్యాలు దాగి ఉంటాయి.

Advertisement

ఆ విల్లా ఒకప్పుటి పాపులర్ బ్యాలెట్ కళాకారిణి దేవోరా కాసిమర్ ది. మొదట ఆమె వారిని ఆప్యాయంగా ఆహ్వానించినా, తరువాతే గూస్ బంప్స్ తెప్పించే ట్విస్టులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ ప్రదేశం ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లకు ఆశ్రయంగా మారిందని ఆ యువతులు గ్రహించడానికి ఎక్కువ టైమ్ పట్టదు. కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. గ్యాంగ్‌స్టర్లు వాళ్ళను అక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లనివ్వకూడదని నిర్ణయిస్తారు. బయటకు వెళ్లే దారి ఉండదు. సహాయం చేసే వారు ఎవరూ ఉండరు. ప్రతి క్షణం ప్రాణాలకు ముప్పుగానే మారుతుంది.

అలాంటి సమయంలో ఆ యువతులు తమ బలహీనతనే బలంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు. గత కొన్నేళ్లుగా నేర్చుకున్న బ్యాలెట్ శిక్షణను ప్రాణాలను కాపాడుకోవడానికి ఫైట్ లో ఉపయోగించడం ప్రారంభిస్తారు. వారి వేగం, శరీర నియంత్రణ, కచ్చితమైన కదలికలు గ్యాంగ్‌స్టర్లను ఆశ్చర్యపరుస్తాయి. ఒక్కో దాడిని తెలివిగా తప్పించుకుంటూ, ఎదురుదాడి చేస్తూ, తమ చుట్టూ ఉన్న ప్రతి వస్తువునూ ఆయుధంగా మార్చుకుంటూ ముందుకు సాగుతారు. కళగా కనిపించిన డ్యాన్స్, ప్రాణాలు కాపాడే యుద్ధ నైపుణ్యంగా మారిన తీరు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది.

Advertisement

చివరికి ఆ ఐదుగురు యువతులు గ్యాంగ్‌స్టర్ల చెర నుంచి తప్పించుకోగలిగారా ? ఆ విల్లా వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి ? దేవోరా కాసిమర్ పాత్ర వెనుక ఉన్న నిజం ఏంటి ? చివరికి ఈ పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రెట్టీ లెతల్’లో తెలుగు అమ్మాయి అవంతిక వందనపు, మాడీ జీగ్లర్, లానా కాండోర్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఉమా థుర్మాన్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ప్రస్తుతం Amazon Prime Videoలో తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: దేశాన్ని దోచుకునే హవాలా కింగ్‌పిన్స్.. చివరికి ఎలా చిక్కారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Related News

కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ

వేల ఏళ్ల రహస్యం… ప్రేమిస్తే శక్తులు మాయమయ్యే తాగుబోతు సూపర్ హీరో కథ

భవిష్యత్తు నుంచి వచ్చిన సైబోర్గ్‌తో ప్రేమ.. చివరి ట్విస్ట్ ఊహించలేరు భయ్యా

సంకెళ్లతో శవానికి బందీగా… గుండె ఆగిపోయే సర్వైవల్ థ్రిల్లర్!

ఓవర్‌టేక్ చేసినందుకే నరకం చూపించే సైకో… ఈ రోడ్ రేజ్ థ్రిల్లర్ మైండ్ బ్లోయింగ్

చంబల్ అడవిలో బందిపోట్లకు చుక్కలు చూపించిన యువతి… చివరి అరగంట గూస్‌బంప్స్ గ్యారంటీ

దేశాన్ని దోచుకునే హవాలా కింగ్‌పిన్స్.. చివరికి ఎలా చిక్కారో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

Big Stories

Advertisement
×