BigTV English

High Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

High Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

High Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు లేదా చెడు కొలెస్ట్రాల్ (LDL) ఎక్కువగా ఉన్నప్పుడు మందుల వాడకం తప్పనిసరి అవుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇలాంటి పరిస్థితిలో మందులు వాడటం అవసరం లేదు. పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి సహజంగా కూడా అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.


అధిక కొలెస్ట్రాల్, LDL (చెడు కొలెస్ట్రాల్) నియంత్రించడానికి సహజ పద్ధతులను అనుసరించడం సురక్షితమైన, సమర్థవంతమైన పరిష్కారం. అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ముందుగా లిపిడ్ ప్రొఫైల్‌ను చెక్ చేయండి. ఇందుకు మూడు పద్దతులు ఉన్నాయి. వాటి ఆధారంగానే మీకు మందులు అవసరమా లేదా సహజంగానే కొలెస్ట్రాల్ తగ్గించుకోచ్చా అనే అంశంపై పూర్తి అవగాహన కలుగుతుంది.

మొదటిది ట్రైగ్లిజరైడ్స్, రెండవది, మంచి కొలెస్ట్రాల్ (HDL) మూడవ ట్రైగ్లిజరైడ్స్/HDL నిష్పత్తి.


ట్రైగ్లిజరైడ్స్: 150 mg/dL కంటే తక్కువ ఉండాలి.

ట్రైగ్లిజరైడ్స్/HDL నిష్పత్తి యొక్క ప్రాముఖ్యత

ట్రైగ్లిజరైడ్స్/HDL నిష్పత్తి 1.5 కంటే తక్కువగా ఉంటే, మీ గుండె ఆరోగ్యం బాగున్నట్లే. ఇందుకోసం మందులు వాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ నిష్పత్తి 1.5 కంటే ఎక్కువ ఉంటే ఆహారం, జీవనశైలిలో మార్పులు అవసరం.

ఆహారంలో మార్పు:
1.ఈ సమయంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల తీసుకోవడం మంచిది. అంతే కాకుండా వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా విత్తనాలు, చేపలు (సాల్మన్, మాకేరెల్) తినండి.

2.ఆరోగ్యకరమైన కొవ్వుల కోసం, కొబ్బరి నూనె, దేశీ నెయ్యి , అవకాడో తినండి.

3. ఓట్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, పండ్లు , గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలలో తీసుకోండి.

అధిక కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి ?

శోథ నిరోధక ఆహారాలు:

అల్లం, వెల్లుల్లి, పసుపు, నల్ల మిరియాలు క్రమం తప్పకుండా తీసుకోండి. గ్రీన్ టీ, లెమన్ టీ కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు , జంక్ ఫుడ్స్ తినడం పూర్తిగా తగ్గించండి.

శారీరక శ్రమ:
రోజు 30 నిమిషాల వ్యాయామం చేయండి:

నడక, యోగా లేదా సైక్లింగ్ చేయడం మంచిది. వారానికి 4-5 రోజులు తప్పకుండా ఈ 3 చేయాలి. కొలెస్ట్రాల్ పెరగడానికి ఊబకాయం ప్రధాన కారణం కాబట్టి అధిక బరువును కూడా తగ్గించుకోండి. బరువు తగ్గడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

ఒత్తిడి తగ్గించుకోవాలి:

ఒత్తిడి లేకుండా ఉండండి. ఇందుకోసం యోగా మీ జీవనశైలిలో చేర్చుకోండి. ధ్యానం, ప్రాణాయామం కూడా ప్రభావవంతంగా కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి.

Also Read: మీ కాళ్లు, చేతుల్లో ఈ లక్షణాలున్నాయా ? మీ శరీరంలో విటమిన్ బి12 తగ్గినట్లే !

మందులు ఎప్పుడు వాడాలి?
LDL అంటే చెడు కొలెస్ట్రాల్ 190 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.
మధుమేహం, రక్తపోటు సమస్య విషయంలో.
3-6 నెలల సహజ చికిత్సల తర్వాత కొలెస్ట్రాల్ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Bald head: పురుషుల్లో బట్టతల రావడానికి.. అసలు కారణాలివేనట !

Vitamin C: వీటిలో.. విటమిన్ సి పుష్కలం !

Guava: వీళ్లు.. పొరపాటున కూడా జామపండ్లు తినొద్దు !

Best Tips For Skin: అందంగా కనిపించాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి !

Breakfast: ఉదయం పూట.. ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తినాలో తెలుసా ?

Back Pain: నడుము నొప్పి రావడానికి అసలు కారణాలివే !

Big Stories

×