Kavya shree:మెజీషియన్ గా కెరియర్ మొదలుపెట్టి.. జబర్దస్త్ షోలో కంటెంట్ రైటర్ గా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుని, ఆ తర్వాత కమెడియన్ గా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) అద్భుతమైన కామెడీ టైమింగ్ తో టీం లీడర్ గా ఎదిగి, అందరి దృష్టిని ఆకట్టుకున్న సుధీర్.. ఒకప్పుడు జబర్దస్త్ లో ఉన్నప్పుడు యాంకర్ రష్మి (Anchor Rashmi) తో లవ్ ట్రాక్ నడిపి షో కి మంచి టిఆర్పి రేటింగ్ తీసుకొచ్చారు..ఇక ఈమెతో ప్రేమలో పడ్డారని, పెళ్లి కూడా చేసుకుంటారు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టి పారేశారు.
జబర్దస్త్ వదిలేసి సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ అక్కడ పలు చిత్రాలు చేసి మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2. తాజాగా 17వ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదల చేయగా అందులో కావ్యాతో లవ్ ట్రాక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. పైగా ఫ్రెష్ ఫీల్ వస్తుంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2 కి సుధీర్ మరదల్లుగా అషు రెడ్డి , స్రవంతి చొక్కారపు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిని తీసేసి మరదల్లుగా కావ్యాతో పాటు రీతు చౌదరిని నియమించారు.
ఇకపోతే కొన్ని షోలలో వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఫ్యామిలీ స్టార్ట్స్ లో.. సుధీర్ తో కావ్య చనువుగా కనిపించడం హైలైట్ గా నిలిచింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. నిధి కోసం వీరందరూ గొడవ పడుతున్నారు అని సుధీర్ కావ్యాతో చెప్పగా.. అవునా మరి మీరు గొడవపడలేదా? అని కావ్య అమాయకంగా అడుగుతుంది. దీనికి సుధీర్.. నీ రూపంలో నిధి నా దగ్గరే ఉండగా మరి నేను ఎందుకు గొడవ పడతాను అంటూ కావ్య పై తన ప్రేమ ఒలకబోశారు.
also read:‘బౌలీ ఆర్ట్ సంఘం’ చైర్ పర్సన్ గా అల్లు అర్జున్ భార్య!
ఇక తర్వాత గేమ్ నిర్వహించగా అందులో కావ్యాతో మీ లక్కీ నంబర్ ఏంటో చెప్పండి అని సుధీర్ అడగగా.. మీ లక్కీ నంబర్ వన్ అయినప్పుడు.. నాది కూడా వన్ అంటూ కామెంట్ చేసింది. ఇక తర్వాత పట్టాభిషేకం కు సిద్ధం చేసుకోండి నెక్స్ట్ వీక్ నుండి మరదళ్లు చేంజ్ అంటూ రీతూ చౌదరి, కావ్యాలను తన కొత్త మరదళ్లుగా ప్రకటించారు ఇక తర్వాత కావ్య ఇదంతా నీ వల్లే సుదీర్ అంటూ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం వైరల్ గా మారింది. మొత్తానికి అయితే కావ్య శ్రీ సుధీర్ మరదలిగా ప్రమోట్ పొంది బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా షో టిఆర్పి రేటింగ్ కోసం సెలబ్రిటీస్ ఇంకా ఎంతమందితో ఎన్నిసార్లు లవ్ ట్రాక్ నడుపుతారో చూడాలి అంటూ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.