Pandu mirapakaya pachadi: చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ ఉండే పచ్చళ్లలో పండు మిరపకాయ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. కారం కారంగా, పుల్లపుల్లగా ఉండే.. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. ఏడాదంతా.. నిల్వ ఉండే ఈ అద్భుతమైన పండు మిరపకాయ పచ్చడిని పక్కా కొలతలతో చాలా ఈజీగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
పండు మిరపకాయలు:1 కేజీ
చింతపండు: 250 గ్రాములు
ఆవాలు: 50 గ్రాములు
మెంతులు: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : 200 గ్రాములు
పసుపు: 1 టేబుల్ స్పూన్
ఆవనూనె లేదా పల్లీ నూనె: సరిపడా
వెల్లుల్లి రెమ్మలు: 2 కప్పులు
1. ముందుగా పండు మిరపకాయలను.. తెచ్చి మంచి నీటితో కడగాలి. ఆ తర్వాత వాటిని ఒక శుభ్రమైన టవల్ పై పరిచి, తడి పూర్తిగా ఆరిపోయే.. వరకు గాలిలో ఆరబెట్టాలి. మిరపకాయలు పూర్తిగా.. ఆరిన తర్వాత వాటి తొడిమలను తొలగించి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే.. చింతపండులో ఉన్న నార, గింజలను పూర్తిగా ఏరేసి పక్కన పెట్టుకోవాలి.
2. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి మెంతులను దోరగా వేయించాలి. అవి వేగాక దించేసి.. మెత్తటి పొడిలా రుబ్బుకోవాలి. అలాగే.. ఆవాలను కూడా కొద్దిగా మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడులను పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్‌లో లేదా రూట్లో.. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కలు, ఉప్పు, చింతపండు, పసుపు వేసి మెత్తగా.. రుబ్బుకోవాలి. రోట్లో దంచితే రుచి మరింత అద్భుతంగా వస్తుంది. మిశ్రమం బాగా నలిగిన తర్వాత.. అందులో సిద్ధం చేసుకున్న మెంతుల పొడి, ఆవపిండి వేసి మరోసారి బాగా కలపాలి.
Also Read: ఆలూ స్ప్రింగ్ రూల్స్..క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ
3. ఈ పచ్చడిని ఒక గాజు లేదా జాడీలో నిల్వ చేయాలి. సాధారణంగా.. పండు మిరపకాయ పచ్చడి ఉప్పు, చింతపండులో.. మగ్గిన తర్వాతే.. అసలైన రుచి వస్తుంది.3 లేదా 4 రోజులు పచ్చడిని అలాగే ..ఉంచితే మిరప కాయలు ఉప్పు, పులుపును బాగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కొద్దిగా నూనెలో.. వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుని పచ్చడిలో కలుపుకోవచ్చు.
వాడుకునే ముందు కొద్దిగా పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పక్కా కొలతలతో చేసిన పండు మిరపకాయ పచ్చడి ఏడాదంతా తాజాగా, నోరూరించే రుచితో ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే ఆ సంతృప్తే వేరు!