BigTV English

Is Heart Attack hereditary? : హార్ట్ ఎటాక్.. వంశపార్యం పరంగా వస్తుందా..?

Is Heart Attack hereditary? : హార్ట్ ఎటాక్.. వంశపార్యం పరంగా వస్తుందా..?

Heart Attack


Is Heart Attack Hereditary Disease: మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం వల్లే చాలామంది హార్ట్‌ ఎటాక్ బారిన పడుతున్నారు. ఈ సమస్యలను వయసుతో సంబంధం లేకుండా పెద్దవాళ్లు నుంచి యువత వరకు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత జీవనశైలి కారణంగా యువతలో ఈ సమస్య 35 శాతం పెరిగింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా హార్ట్‌ ఎటాక్ కారణాలు గురించి తెలుసుకుందాం.

వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల చాలామంది హృదయ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని హార్ట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం మంచి ఆలోచనే.. అయినప్పటికీ.. వర్కౌట్లు అధికంగా చేయడం మంచిది కాదు. అధిక వ్యాయామం వల్ల బ్లడ్ ప్రెజర్‌లో ఎక్స్‌ట్రా ప్రెసర్ ఏర్పడుతుంది. దీని కారణంగా హైబీపీ, హార్ట్ ఎటాక్ సమస్యలు వస్తున్నాయి. ఫిట్నెస్‌పై ఫోకస్ చేసినప్పుడు మీ ఆహారంపై కూడా ఫోకస్ అవసరం. ప్రతి రోజు మీ శరీరానికి అవసరమయ్యే పోషకాలు తీసుకోవాలి.


READ MORE: బీకేర్ ఫుల్ అమ్మాయిలు.. లేదంటే మీ ఫేస్..!

వ్యాయామం అనేది నెమ్మదిగా చేస్తూ మీ ఫిజికల్ ఫిట్నెస్‌ని పెంచుకోవాలి. అంతే కానీ ఫిట్నెస్ పేరుతో ఇబ్బందులను తెచ్చుకోవద్దు. శరీరాన్ని ఒత్తిడిలో పడేయడం వల్ల మీకు సరైన పోషకాలు అందవు.

హార్ట్ ఎటాక్ వంశపార్యపరంగా వస్తుందా..?

ప్రతి ఒక్కరు వంశపార్యంపరంగా వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. రాబోయే సమస్యల గురించి తెలుసుకోవాలి. ఏదైనా సమస్యలను గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి. కానీ చాలామంది వంశపార్యంపరంగా వచ్చే సమస్యలపై దృష్టి పెట్టడం లేదు. హఠాత్తుగా వీటి వల్ల కూడా ముప్పు వస్తుంది.

అయితే హార్ట్ ఎటాక్ వంశపార్యంపరంగా వస్తుందనే అంశాన్ని ఏ వైద్యులు, శాస్త్రవేత్తలు నిర్ధారించలేదు. చెప్పాలంటే నలభై ఏళ్ల వ్యక్తికి హార్ట్ ఎటాక్ వస్తే.. వాళ్ల కొడుకు లేదా కూతురుకు కూడా అదే వయసులో హార్ట్ ఎటాక్ వస్తుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిచండి. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. రెగ్యులర్‌‌‌గా హెల్త్ చెకప్ చేయించుకోండి. అశ్రద్ధ వహించడం మంచిది కాదు.

READ MORE: లోబీపీ ఎందుకు వస్తుంది?.. తగ్గాలంటే ఏం చేయాలి?

గతంలో హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూనే గ్రౌండ్‌లోనే హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు నిపుణులు. శరీరానికి తగినంత వ్యాయామం, శారీరక శ్రమ చేయడం ద్వారా గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చునని చెబుతున్నారు.

ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడిని జయించే యోగాసాలు వేయటం వల్ల ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ఇలాంటివి చేయటం వల్ల ఆకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్‌ల నుంచి తప్పించుకోవచ్చునని సలహా ఇస్తున్నారు.

Disclaimer : ఆరోగ్య నిపుణుల అధ్యయనాల మేరకు, పలు అధ్యయనాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించాం.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×