BigTV English

Infinix Smart 8 Plus @ Rs 6,999: సెకండ్ హ్యాండ్ ఫోన్ కంటే తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్

Infinix Smart 8 Plus @ Rs 6,999: సెకండ్ హ్యాండ్ ఫోన్ కంటే తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్


Infinix Smart 8 Plus @ Rs 6,999: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ తాజాగా మరొక మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. దీనిని ‘ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్’ పేరుతో తీసుకొచ్చింది. అందరికీ సరసమైన ధరలో.. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.

ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అమర్చారు. అంతాకాకుండా భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ మొబైల్ కలిగి ఉంది. అలాగే ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా ఇందులో అందించారు. ఈ ఫోన్‌కు సంబంధించి ధర, ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. అయితే కంపెనీ అందరికీ అందుబాటు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తెచ్చింది.

READ MORE: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

దీని రూ.9,999 ఉండగా.. ఇప్పుడు 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,799లకే అందుబాటులో ఉంది. కాగా దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఆ బ్యాంక్ ఆఫర్లను కలుపుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999కే సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ మొబైల్ సేల్ మార్చి 8 అంటే రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో స్టార్ట్ కానుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:

ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళా HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90HZ కాగా.. టచ్ శాంపిల్ రేట్ 180Hzగా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత xOS 13 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. 12nm మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలను అమర్చారు. అందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగా పిక్సెల్‌గా ఉంది. అంతేకాకుండా దీంతోపాటు ఏఐ ఆధారిత సెన్సార్‌ను కూడా అందించారు. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంచారు.

READ MORE: ఒక్క నెల రీఛార్జ్ ప్యాక్ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్.. ఈ ఆఫర్ మిస్ చేయకండి

కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఉండే ఇన్‌ఫినిక్స్ మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను అందించారు. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

Tags

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×