క్యాబేజీ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను కలిగి ఉంటుంది. ఇది క్రూసిఫెరాస్ జాతికి చెందిన కూరగాయ. అనేక వంటకాలలో దీన్ని భాగం చేసి వండుతారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ పచ్చిగా మాత్రం తినకూడదని గుర్తు పెట్టుకోండి. క్యాబేజీని కేవలం వండిన తర్వాత మాత్రమే తినాలి. పచ్చి క్యాబేజీని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
పచ్చి క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి మంచిది. అయితే కొంతమందికి అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ అసౌకర్యానికి దారితీస్తుంది. అందులో ఉబ్బరం, గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి క్యాబేజీని ఉడికించి కూరగా వండి తినడం వల్ల అది జీర్ణం కావడం సులభంగా మారుతుంది.
థైరాయిడ్ పనితీరు
క్యాబేజీ థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని అంటారు. ఇతర క్రూసిఫెరాస్ కూరగాయల్లాగే క్యాబేజీలో కూడా గాయిట్రోజెన్లు అని పిలిచే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అయోడిన్‌ను తీసుకోవడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలుగుతుంది. అయితే క్యాబేజీని వండడం వల్ల ఈ గాయిట్రోజెన్ల పనితీరు కొంతవరకు తగ్గుతుంది. కాబట్టి పచ్చి క్యాబేజీని తింటే థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది. అదే వండిన క్యాబేజీ తినడం వల్ల పెద్దగా ప్రమాదం లేదు.
క్యాబేజీతో సహా పచ్చి కూరగాయల పెస్టిసైడ్స్ ను అధికంగా చల్లుతున్నారు. కాబట్టి వీటిని పూర్తిగా కడగకుండా తినడం వల్ల ఆ పెస్టిసైడ్స్ శరీరంలో చేరి అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. క్యాబేజీలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.
పచ్చి క్యాబేజీలో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే సమ్మేళనాలు ఉంటాయి. దీనివల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. పొట్ట ఉబ్బరంగా అనిపించడం, విపరీతంగా గ్యాస్ బయటకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సున్నితమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉన్నారు. తరచూ గ్యాస్టిక్ సమస్య బారిన పడుతూ ఉంటారో పచ్చి క్యాబేజీని తినడం మానుకుంటే మంచిది.
Also Read: తులసి ఆకులు తింటే.. బోలెడు ప్రయోజనాలు !
పచ్చి కూరగాయలు తినడం వల్ల అధిక పోషకాలు ఉంటాయని అంటారు. అయితే క్యాబేజీలోని పోషకాలు పచ్చిగా తింటే అనారోగ్యాలకు గురిచేస్తాయి. కాబట్టి వంట చేయడం ద్వారా ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. క్యాబేజీని వండి తినడం వల్ల కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాల శోషణం కూడా పెరుగుతుంది. శరీరం వాటిని ఉపయోగించుకోగలదు. కాబట్టి క్యాబేజీని వండి తినడానికి ప్రయత్నించండి.
క్యాబేజీలో కొన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఆ ప్రోటీన్లు అందరికీ పడాలని లేదు. కొంతమందికి సరిపడకపోవచ్చు. అలాంటి సమయంలో పచ్చి క్యాబేజీని తినడం వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి క్యాబేజీని తినడం మానేసి వండిన తర్వాతే తినడం అలవాటు చేసుకోవాలి.