BigTV English

Dhee Re Release: రీ- రిలీజ్ కి సిద్ధమైన మంచు విష్ణు మూవీ.. ఆయన కామెడీ కోసమైనా చూడాల్సిందే..!

Dhee Re Release: రీ- రిలీజ్ కి సిద్ధమైన మంచు విష్ణు మూవీ.. ఆయన కామెడీ కోసమైనా చూడాల్సిందే..!

Dhee Re Release: గత రెండు మూడు సంవత్సరాలుగా సెలబ్రిటీల అభిమానులు.. తమ నటీనటుల సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ సంతోషపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు(Maheshbabu) ‘పోకిరి’ సినిమాతో మొదలైన ఈ రీ రిలీజ్ చిత్రాల హవా.. ఇప్పటికీ ట్రెండింగ్ అవుతోంది. తమ అభిమాన హీరోల కొత్త సినిమాలు లేకపోయినా.. వారి పుట్టినరోజు సందర్భంగా లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ సందర్భంగా.. వారి సినీ కెరియర్లో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలను విడుదల చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు (Manchu Vishnu) కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ‘ఢీ’ సినిమా కూడా రీ రిలీజ్ కి సిద్ధం అయింది.


రీ రిలీజ్ కి సిద్ధమైన ఢీ..

2007 ఏప్రిల్ 13వ తేదీన విడుదలైన ఈ చిత్రం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. వెంకీ తర్వాత శ్రీను వైట్ల (Srinu vaitla)హాస్యం బాగా పండిన చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు, జెనీలియా , శ్రీహరి , బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, సునీల్, శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ప్రేమ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య స్టార్ కాస్ట్ తో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. చక్రి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించగా.. మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. శ్రీనువైట్ల, గోపి మోహన్, కోన వెంకట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందివ్వడం జరిగింది. ఇదిలా ఉండగా మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న కన్నప్ప(Kannappa ) సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తూ ఉండగా.. ఈలోపే ఢీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాడు మంచు విష్ణు.


వారి కామెడీ కోసమైనా చూడాల్సిందే..

విష్ణు, జెనీలియా జంటగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కన్నప్ప విడుదలకు ముందు రిలీజ్ చేస్తుండడంతో అంచనాలు పెంచడానికి ఇలా మంచు విష్ణు ప్లాన్ చేశారని నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా దివంగత నటుడు శ్రీహరి ఇందులో విలన్ గా నటించినా తన కామెడీతో అద్భుతంగా మెప్పించారు. ఇక సునీల్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం తదితరులు తమ కామెడీ మార్క్ చూపించారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మార్చి 28వ తేదీన హెచ్డీ ప్రింట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. ఈ మేరకు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ట్వీట్ చేయడం గమనార్హం.

ALSO READ :Prabhas : కోమాలో ప్రభాస్ అంటూ తప్పడు ప్రచారం… ఫైర్ అయిన డార్లింగ్ ఫ్యాన్స్

మంచు విష్ణు కెరియర్..

మంచు మోహన్ బాబు (Mohan babu) పెద్ద కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. మరొకవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మంచు విష్ణు.. ఇంకొక వైపు తన డ్రీం ప్రాజెక్టు కన్నప్పను తెరకేక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సెలబ్రిటీ పోస్టర్లు, టీజర్ ఏవి కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మరి విడుదలైన తరువాత ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×