BigTV English

Chhaava Movie: అరె ఏంట్రా ఇది.. మరీ ఇలా తయారయ్యేంట్రా బాబు..

Chhaava Movie: అరె ఏంట్రా ఇది.. మరీ ఇలా తయారయ్యేంట్రా బాబు..

Chhaava Movie: పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది కదా.. ఇప్పుడు అది ఎందుకు చెబుతున్నారు అనే డౌట్ వస్తుంది కదా అవునండి అది చెప్పడానికి ఒక సందర్భం వచ్చింది అందుకే ఆ సామెతతో మొదలు పెట్టాల్సి వచ్చింది. సినిమాలను చూసి యువత చెడిపోతున్నారు అని ఒకప్పుడు పెద్ద వాదన వినిపించేది.. తర్వాత సినిమాలకు అలవాటుపడ్డారులే అని సరి పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈ మధ్య సినిమాలో ఎలా ఉంటే అలా చేస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు ఓ సినిమాని చూసి ఏకంగా పార భుజం ఏసుకొని తవ్వకాలు మొదలుపెట్టారు.. ఏంటి వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ అవునండి నిజంగానే.. అసలు విషయానికివస్తే.. బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన విక్కీ కౌశల్ మూవీ ఛావా లో నిధుల గురించి చెప్పారు. అది నిజమే అనుకోని కొందరు గునపం పట్టుకొని తవ్వకాలు మొదలు పెట్టారు.. ఆ విచిత్ర ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది.. వివరాల్లోకి వెళితే…


ఛావా ఎఫెక్ట్.. మధ్య ప్రదేశ్ లో తవ్వకాలు.. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన ఛావా మూవీ స్టోరీకి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు.. కొందరు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఆ సినిమాలో చూపించినట్టుగా నిజంగానే గుప్త నిధులు ఉన్నాయంటూ పుకార్లు వినిపించడంతో ఆ ప్రాంతమంతా ప్రజలు పరుగులు పెట్టి మరి తవ్వకాలు మొదలుపెట్టారు. దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇక నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. అది ఎక్కడో కాదు మధ్య ప్రదేశ్ లోనే జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో అసిర్‌గఢ్ కోట చుట్టూ గుమిగూడి అర్ధరాత్రి తవ్వడం మొదలు పెట్టిన వందలాది మంది ప్రజలు తవ్వకాలు మొదలు పెట్టారు. ఒక్క సినిమా ఆ ప్రాంతాన్ని మార్చేసిందని చెప్పాలి.. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు జనాలకు వివరణ ఇచ్చే పనిలో ఉన్నారని తెలుస్తుంది.


ఛావా మూవీ కలెక్షన్స్.. 

శంభాజ్ మహారాజుగా విక్కీ కౌశల్ నటనకు నేషనల్ అవార్డు ఒక్కటే కాదు.. సినిమా రంగంలో ఎన్ని అవార్డులుంటే అన్నీ విక్కీ కౌశల్‌కు రావాల్సిందే అన్నంగా గొప్పగా ఆ పాత్రలో జీవించాడు. ఫిబ్రవరి 14న భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర వీర విధ్వంసం సృష్టిస్తుంది. అసలు.. ఈ సినిమా ధాటికి నార్త్ బెల్ట్‌లో వేరే సినిమాలకు థియేటర్‌లు దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఛావా హవానే కనిపిస్తుంది. ఇక రీసెంట్గా తెలుగులో కూడా రిలీజ్ అయినయి మూవీ మంచి టాప్ తో పాటు కలెక్షన్స్ ని కూడా రాబడుతుంది. తెలుగులో ఒక్కరోజులో మూడు కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.. అటు హిందీలో వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ సినిమా మరో సంచలన రికార్డుకు దగ్గరలో ఉంది. 19 రోజులకు ఈ సినిమా అక్షరాల రూ.471 కోట్లకు పగా కలెక్షన్లు సాధించింది. ఈ వీకెండ్ లోపే 500 కోట్లు దాటిన ఆశ్చర్యపోనవసరం లేదు..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×