Rain alert: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అకాల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పడింది. అయితే ఒక్కసారి రాష్ట్రంలో వాతావరణం మారింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
రాబోయే 2 రోజులు భారీ వర్షాలు..
ఈ క్రమంలోనే వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలను అలెర్ట్ చేసింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావారణ శాఖ వివరించింది.
వడగళ్ల వర్షం..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లాలో కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పడింది. రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. మాదాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, కొండాపూర్, మియాపూర్ లో వర్షం దంచికొడుతుంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. అవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు, మూడు రోజులు రైతులు, ప్రజలు పొలం పనులకు వెళ్లొద్దని చెప్పారు. జీహెచ్ఎంసీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కరెంట్ పోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
ALSO READ: UOH Recruitment: గుడ్ న్యూస్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.2,18,200 శాలరీ..