Floor Cleaning Tips: ఇంటి పరిశుభ్రత అందానికి మాత్రమే కాకుండా మన ఆరోగ్యంపై కూడా ముడిపడి ఉంటుంది. ఇంట్లో నేలపై పేరుకుపోయిన మురికి అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది చిన్న పిల్లలకు మరింత హానికరం. కానీ చాలా మంది కొన్ని ప్రాంతాలను మాత్రమే తరచుగా శుభ్రం చేస్తారు. ఇంటి మూలలను పెద్దగా పట్టించుకోరు.
డ్రాయింగ్ రూమ్ నుండి బెడ్ రూమ్ వరకు, ముఖ్యంగా వంటగది , వాష్ రూమ్ మూలలు అత్యంత మురికిగా ఉంటాయి. వాటిని శుభ్రం చేయకపోతే చాలా మురికిగా మారతాయి. అంతే కాకుండా వ్యాధులకు కూడా ఇవి కారణం అవుతాయి. మరి ఇలా జరగకుండా ఉండాలంటే ఇంట్లోని అన్ని మూలలు శుభ్రం చేయాలి. మురికిగా మారిన ప్రాంతాలను క్లీన్ చేయడం అంత ఈజీగా కాదు. ఇలాంటి సమయంలోనే మీకు కొన్ని రకాల టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఎలాంటి టిప్స్ మీ ఇంట్లోని టైల్స్ మెరిసేలా చేయడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
టైల్స్ శుభ్రం చేయడానికి చిట్కాలు:
నిమ్మకాయ:
నిమ్మకాయలో ఉండే బ్లీచింగ్ ఏజెంట్ టైల్స్ శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో పాత్రల నుండి వంటగది, బాత్రూం మూలల వరకు ప్రతిదీ పూర్తిగా శుభ్రం చేయవచ్చు. మొండి మరకలను పూర్తిగా తొలగించడంలో కూడా నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది.
వెనిగర్:
వెనిగర్ అనేది ఒక సహజ క్లెన్సర్. ఇది నేలలను శుభ్రంగా, మెరిసేలా చేస్తుంది. ఒక బకెట్ నీటిలో అర కప్పు వెనిగర్ కలిపి ఈ ద్రావణంతో నేలను శుభ్రం చేయండి.
ఉప్పు:
ఉప్పు అనేది మురికి, మరకలను తొలగించడంలో సహాయపడే సహజమైన క్లెన్సర్. ఒక బకెట్ నీటిలో అర కప్పు ఉప్పు, కాస్త నిమ్మరసం కలిపి ఈ ద్రావణంతో నేలను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల టైల్స్ మురికి తొలగిపోతుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్:
హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక క్రిమిసంహారక మందు. ఇది నేలలను శుభ్రపరచడానికి, క్రిములను చంపడానికి సహాయపడుతుంది. ఒక బకెట్ నీటిలో అర కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి ఈ ద్రావణంతో నేలను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల టైల్స్ తెల్లగా మెరిసిపోతాయ్.
ఇలా కూడా క్లీన్ చేయవచ్చు:
టైల్స్ క్లీన్ చేయడానికి రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ తీసుకోండి. దీనిలోనే కాస్త బేకింగ్ సోడా వేసి కలపండి. తర్వాత దీనిలోనే కాస్త నీరు పోసి మిక్స్ చేసి టైల్స్‌పై మురికి ఉన్నచోట పోయండి. 15 నిమిషాలు ఆగి బ్రష్‌తో రుద్దండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే ప్లోర్ క్లీన్ గా మారుతుంది. అంతే కాకుండా తెల్లగా మెరిసిపోతుంది.
Also Read: హెన్నాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా !
బ్లీచింగ్ పౌడర్ :
బ్లీచింగ్ పౌడర్ కూడా టైల్స్ శుభ్రం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లీచింగ్ పౌడర్‌లో కాస్త నీరు వేసి ఆ నీటిని టైల్స్ మురికిగా ఉన్న చోట చల్లారి 15 నిమిషాల తర్వాత టైల్స్ బ్రష్ తో రుద్దాలి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాకుండా టేల్స్ కొత్తవాటిలాగా మెరుస్తాయి.