Henna Appling For White Hair: తెల్ల జుట్టు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టుతో ఆందోళన చెందుతున్నారు. జుట్టు తెల్లబడటం అనేది ఇకపై వృద్ధాప్యానికి సంకేతం మాత్రమే కాదు, ఇప్పుడు ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తోంది. వృద్ధాప్యంలో జుట్టు తెల్లబడటం గురించి పెద్దగా ఒత్తిడి ఉండకపోయినా, చిన్న వయస్సులో ఇది ఇబ్బంది అనిపిస్తుంది. తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.
ముఖ్యంగా శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారుతుంది. మరి ఇలాంటి సమయంలో మార్కెట్‌లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ వాడే వారు చాలా మందే ఉంటారు. రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకే ఇంట్లోనే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల తెల్ల జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చు. ఇందుకు హెన్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేచురల్ హెన్నాతో మీరు మీ తెల్ల జుట్టును క్షణాల్లోనే నల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
హెన్నాలో కొన్ని రకాల పదార్థాలను కలిపి మీ జుట్టుకు అప్లై చేస్తే.. అది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో పాటు ,మెరిసేలా చేయడంలో ప్రభావవంతంగా సహాయపడుతుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు
ఉసిరి పొడి , హెన్నా:
కావాల్సినవి:
నేచురల్ హెన్నా- 1 చిన్న కప్పు
ఉసిరి పొడి- 2 టేబుల్ స్పూన్లు
నీరు- తగినంత
అప్లై చేసే విధానం:
ముందుగా పైన తెలిపిన మోతాదులో హెన్నా, ఉసిరి పౌడర్ తీసుకుని వాటిలో నీరు పోసి మిక్స్ చేయండి. ఇప్పుడు హెన్నా పేస్ట్ సిద్ధం చేసుకోండి. దీనిని తర్వాత జుట్టుకు అప్లై చేసి ఆరనివ్వండి. 30 నిమిషాల తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి. తర్వాత జుట్టును ఆరనివ్వండి. మీరు దీన్ని నెలకు రెండుసార్లు ఉపయోగిస్తే, మీ జుట్టు నల్లగా కనిపించడం ప్రారంభమవుతుంది.
కాఫీ పౌడర్, హెన్నా :
ఎలాంటి రసాయన ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీరు బ్రాహ్మి పౌడర్, హెన్నాతో కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
కావాల్సినవి:
హెన్నా- 1 చిన్న కప్పు
కాఫీ పౌడర్- 2 టీ స్పూన్లు
బ్రాహ్మి పౌడర్- 1 టేబుల్ స్పూన్ ( వీలైతే)
Also Read: ఇలా చేస్తే.. నల్లగా మారిన కాళ్ల పట్టీలైనా కొత్త వాటిలా మెరిసిపోతాయ్ !
ఎలా అప్లై చేయాలి:
దీని కోసం ముందుగా ఒక గిన్నెలో హెన్నా పౌడర్ తీసుకోండి. ఇప్పుడు అందులో 2 టీస్పూన్ల కాఫీ పౌడర్ కలపండి. తరువాత దానికి నీళ్ళు పోసి మందపాటి పేస్ట్ లా చేయాలి. దీనిలోనే బ్రాహ్మి పౌడర్ వేసి మిక్స్ చేయండి. తర్వాత దీనిని జుట్టుకు అప్లై చేయండి. మీరు హెన్నా వేసుకున్నప్పుడు, మీ జుట్టు జిడ్డుగా ఉండకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే రిజల్ట్ అంతంగా ఉండదని గమనించండి. జుట్టుకు 40 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత హెన్నాను వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలోనే తెల్లగా మారుతుంది. అంతే కాకుండా దీనిని తరచుగా వాడటం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి హెన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది.