BigTV English

M.M.SriLekha : జక్కన్న చెల్లి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వెనక ఇంత కథ ఉందా..? శ్రీలేఖ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

M.M.SriLekha :  జక్కన్న చెల్లి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వెనక ఇంత కథ ఉందా..? శ్రీలేఖ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?

M.M.SriLekha : సాధారణంగా ఎవరైనా ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు రావాలి అని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ ఇక్కడ దిగ్గజకుడు రాజమౌళి (Rajamouli ) చెల్లి ప్రముఖ మహిళా దర్శకురాలు ఎమ్.ఎమ్ .శ్రీలేఖ (ఎంఎం.SriLekha ) ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చింది? అనే విషయం తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు.. ముఖ్యంగా ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అవడం వెనుక ఉన్న కథ చూస్తే మాత్రం ఒకింత ఆశ్చర్యం కలగక మానదు అని చెప్పవచ్చు. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా తాను మ్యూజిక్ డైరెక్టర్ అవడం వెనుక ఉన్న అసలు విషయాన్ని.. అలాగే తన మొదటి రెమ్యూనరేషన్ ఎంత ? తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు తన వయసు ఎంత? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చింది ప్రముఖ సంగీత దర్శకురాలు శ్రీలేఖ. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) అన్నయ్య కూతురైన ఎమ్. ఎమ్. శ్రీలేఖ అటు ఆస్కార్ గ్రహీత ఎమ్.ఎమ్.కీరవాణి (MM Keeravani), ఇటు ఎస్ ఎస్ రాజమౌళి లకు చెల్లి అవుతుంది.


లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ లో స్థానం..

దిగ్గజ దర్శకుడు జక్కన్న చెల్లిగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న శ్రీలేఖ.. సినీ ఇండస్ట్రీలో లేడీ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. 70 చిత్రాలకు సంగీతం అందించి, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ‘బుక్ ఆఫ్ స్టేట్స్ రికార్డు’లో స్థానం సంపాదించుకుంది శ్రీలేఖ. ఈమె అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లోనే దాదాపు 13 చిత్రాలకు సంగీతం అందించారు


అందుకే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను – శ్రీలేఖ..

ఇకపోతే తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “నేను ఎల్కేజీ తర్వాత స్కూల్ కి వెళ్లడం మానేశాను. సంగీతంపై మక్కువ పెరిగిపోయింది.అయితే ప్రతిరోజు మా ఇంటికి 4 అంబాసిడర్ కార్లు మా అన్నయ్య కీరవాణి కోసం వచ్చేవి. అయితే అన్నయ్య ఇంట్లో బిజీగా ఉన్నప్పుడు ఆ కార్లలో నన్ను కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ వేయమని డ్రైవర్లని అడిగితే వారు విసుక్కునేవారు. అంత చిన్న వయసులోనే వాళ్లు అలా కసురుకునేసరికి ఎంతో ఫీలయ్యేదాన్ని. ఆఖరికి అన్నయ్య కూడా ఏమొద్దు ఇంట్లోనే ఉండు అని అనేవారు. దాంతో బాగా హర్ట్ అయిన నేను నా కోసం ఎందుకు కారు రాదు.. ఒకవేళ మ్యూజిక్ డైరెక్టర్ అయితే నాకోసం కూడా కారు వస్తుంది కదా.. అయితే నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సిందే అని.. 12 ఏళ్ళ వయసులోనే ఫిక్స్ అయ్యాను. అలా ఒకరోజు ‘నాన్నగారు’ సినిమా స్టోరీ బాబాయ్ విజయేంద్ర ప్రసాద్.. దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కు వినిపించడానికి వెళ్ళినప్పుడు.. బాబాయ్ కూడా నన్ను తనతో పాటు తీసుకెళ్లారు. అప్పుడు దాసరి నారాయణరావు ..ఏం చదువుతున్నావ్ అంటే చదువుకోవట్లేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాను. అయితే ఏం చేస్తావేంటి? అని అడగ్గా.. మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చెప్పాను. ఆయన వెటకారంగా ఏది వినిపించు అని చెప్పగానే.. నా దగ్గర ఉన్న ఒక చిన్న కీబోర్డ్ సహాయంతో ఒక 20 పాటలు వరకు పాడి వినిపించాను. దాంతో ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే ‘నాన్నగారు’ సినిమాకు నాకు అవకాశం ఇచ్చారు .

నా మొదటి సంపాదన రూ.25000 – శ్రీలేఖ.

అయితే నా వయసు అప్పుడు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. అదే రోజే లోపలికి వెళ్లి 25 వేల రూపాయల చెక్ రాసి బాబాయ్ చేతికి ఇచ్చారు. ఆ మరుసటి రోజు సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించాను. ఇక ఆ మరుసటి రోజు సంగీత కచేరి కూడా పెట్టించారు” అంటూ తాను మ్యూజిక్ డైరెక్టర్ అవడం వెనుక ఉన్న కల, తన మొదటి పారితోషకం గురించి తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది శ్రీలేఖ. ఇకపోతే “తనకు ఆ వయసులో డబ్బు విలువ తెలియదని, ఈ డబ్బులతో ఎన్ని చాక్లెట్లు వస్తాయి బాబాయ్ అని అడగ్గా నువ్వు తినగలిగినన్ని వస్తాయి.. నువ్వు ఇంకా బాగా పాడగలిగితే ఇంకా ఎక్కువ వస్తాయని బాబాయ్ చెప్పారు” అంటూ శ్రీలేఖ తెలిపింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×