Jagan on Pawan Kalyan: ఏపీలో రాజకీయం హీటెక్కింది. కూటమి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు జోరుగా సాగుతున్న వేళ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష హోదాకు సంబంధించి జగన్ మీడియా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయని చెప్పవచ్చు.
ఏపీ బడ్జెట్ పై జగన్ మాట్లాడుతూ.. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ పేరుతో అన్ని అబద్ధాలు చెప్పించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ అంటూ ఊదరగొట్టి విజయాన్ని అందుకున్న తర్వాత ప్రజలను కూటమి ప్రభుత్వం దర్జాగా వంచిస్తున్నట్లు జగన్ ఆరోపించారు. ముందు ఒక మాట, గెలిచాక ఒక మాట చెప్పి తప్పించుకోవడంలో సీఎం చంద్రబాబు నాయుడుకు అలవాటేనంటూ జగన్ అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఒక్కొక్క పథకానికి కోతలు వేస్తూ పాలన సాగిస్తుందన్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని కేవలం ప్రకటనలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నేపథ్యంల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం ఆ పథకం అమలుకు పావలా కూడా బడ్జెట్ లో కేటాయించలేదంటూ జగన్ విమర్శించారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అరకొర కేటాయింపులతో రెండో బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జగన్ అన్నారు.
పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ జగన్ అన్నారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యారని జగన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచగా, జనసేన పార్టీ నాయకులు, జగన్ చేసిన కామెంట్స్ ని తిప్పి కొడుతున్నారు. అలాగే కూటమికి చెందిన నేతలు సైతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి జగన్ చేసిన కామెంట్స్ తగదని, ఇలాంటి మాటలే 11 తెచ్చాయని స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.
Also Read: Honour Killing: గుంతకల్లులో పరువు హత్య.. కూతుర్ని చంపిన తండ్రి
ఇప్పటి వరకు సీఎం చంద్రబాబుపై సీరియస్ కామెంట్స్ చేసే జగన్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్ వెనుక అసలు మతలబు ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు. ఓ వైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాల్సింది పోయి, మీడియా సమావేశాలు ఏమిటని కూటమి నేతలు అంటున్నారు. గెలిపించిన పులివెందుల ప్రజలకు న్యాయం చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. మొత్తం మీద జగన్ కామెంట్స్ తో జనసేన వర్సెస్ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది.