BigTV English

Prevent Mice: ఇంట్లోకి ఎలుకలు చేరకుండా ఉండాలంటే ఈ ఐదు చిట్కాలు ఫాలో అవ్వండి

Prevent Mice: ఇంట్లోకి ఎలుకలు చేరకుండా  ఉండాలంటే ఈ ఐదు చిట్కాలు ఫాలో అవ్వండి

ఇంట్లో ఎలుకలు చేరితే ఎన్నో వస్తువులను కొరికి పడేస్తాయి. అంతేకాదు అది ప్రమాదకరమైన వైరస్ లను కూడా మోసుకుని తిరుగుతాయి. కాబట్టి ఇంట్లో ఎలుకల బాధను వెంటనే తొలగించుకోవాలి. ఈ ఎలుకలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఎలుకల వల్ల హాంటా వైరస్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం పెరిగిపోతుంది. అందుకే ఎలుకలను సులువుగా ఇంటి నుంచి ఎలా దూరంగా ఉంచాలో తెలుసుకోండి.


ఎలుకలను ఇంటికి దూరంగా ఉంచాలంటే కఠినమైన రసాయనాలు, ఖరీదైన తెగులు నియంత్రణ మందులు అవసరం లేదు. చిన్న చిన్న చిట్కాలు ద్వారానే వాటిని బయటకు పంపించవచ్చు. లేదా బయటనుంచి ఇంటికి రాకుండా అడ్డుకోవచ్చు.

రంధ్రాలను మూసేయండి
ఎలుకలు ఇంట్లోంచి రావడానికి ఏ ప్రదేశం నుంచి లోపలికి వస్తున్నాయో తెలుసుకోండి. అవి చిన్న చిన్న రంధ్రాల గుండా దూరి ఇంట్లోకి వస్తుంటాయి. అలాంటి భాగాలను మూసివేయండి. ఇందుకోసం మీరు స్టీలు లేదా మెటల్ మెష్ ఉపయోగించవచ్చు. అలాగే వంటగది విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వంటగదిలోకే ఎలుకలు వచ్చేందుకు ప్రయత్నిస్తాయి. అక్కడే ఆహార పదార్థాలు దొరుకుతాయి. కాబట్టి వంటగదికి ఎటువైపు నుంచి కూడా ఎలాంటి రంధ్రాలు లేకుండా చూసుకోండి. విరిగిన కిటికీలను ముందుగానే బాగు చేయించుకోండి.


ఆహారాన్ని దాచేయండి
ఎలుకలు ఇంట్లోకి వచ్చేదే ఆహారం కోసం. కాబట్టి ఆహారాన్ని మీరు బయటకు కనిపించేలా ఉంచవద్దు. ఫుడ్ ను గాలి చొరబడని కంటైనర్లలో మూత పెట్టి నిల్వ చేయండి. అలాగే మురికి పాత్రలను సింక్ లో ఉంచకండి. అలాగే చెత్త డబ్బాలను కూడా ఇంట్లో నుంచి రాత్రి బయట పెట్టేయండి. నేలపై ఎలాంటి ఆహారం లేకుండా చూసుకోండి. రాత్రి పడుకోబోయే ముందే ఇంటిని ఒకసారి తుడుచుకోవడం మంచిది. ఎక్కువగా ఎలుకలు మిగిలిపోయిన పండ్లు, ఆహారాలు తినడానికే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఎలాంటి ఆహారాలు దొరకకుండా జాగ్రత్త పడండి. అవి కొన్నాళ్ళకు మీ ఇంటికి రావడమే మానేస్తాయి.

చెత్త ఉంచకండి
ఎలుకలు చెత్తను బాగా ఇష్టపడతాయి. ఎందుకంటే చెత్తలోనే దాక్కోవడానికి తినడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అలాంటి చెత్త కుప్పలు మీ ఇంటి చుట్టుపక్కల లేకుండా చూసుకోండి. ఇంట్లో కూడా డస్ట్ బిన్ దూరంగా ఉంచుకోండి. కార్డ్ బోర్డు పెట్టెలలో కుప్పలుగా కాగితాలు, వస్తువులు పడేసి ఉంచవద్దు. ఎలుకలు అందులోనే గూడుకట్టుకొని పిల్లల్ని పెట్టేస్తాయి. అలాగే కిచెన్ సింక్ కింద కూడా తప్పకుండా శుభ్రం చేసుకోండి. అక్కడ ఏ వస్తువులను ఉంచకండి. ఎలుకలు నమలగలిగే కార్డు బోర్డు పెట్టెలను ఇంట్లో ఉంచకండి. వీలైతే వాటికి ప్లాస్టిక్ కంటైనర్లతో మూసేయండి. ఇలా చేస్తే ఎలుకలు తమ గూడును నిర్మించుకోలేవు. కాబట్టి త్వరగా బయటికి వెళ్లిపోవచ్చు.

వెల్లుల్లి మిరియాల పొడి
ఎలుకలకు కొన్ని రకాల వాసనలు నచ్చవు. అందులో పెప్పర్మెంట్, వెల్లుల్లి, మిరియాలు, అమ్మోనియా వంటివి. పిప్పరమేంట్ ఆయిల్‌ను కొని దూది బాల్స్ ను అందులో ముంచి ఇంట్లోనే కొన్ని పాయింట్లు దగ్గర పెట్టండి. ముఖ్యంగా కిచెన్ లోని సింక్ కింద పెట్టండి. డస్ట్ బిన్ చుట్టూ పెట్టండి. ఇంట్లో మూలల పెట్టడం వల్ల ఎలుకలు ఆ వాసనకి రాకుండా ఉంటాయి. లేదా పిప్పర్మెంట్ ఆయిల్ ని ఎలుకలు వచ్చే అవకాశం ఉన్న చోట బాగా స్ప్రే చేయండి. అలాగే కిటికీలు, తలుపులు వంటి ప్రవేశ ద్వారాల వద్ద వెల్లుల్లి పొడిని, మిరియాల పొడిని చల్లండి. ఇలా చేయడం వల్ల ఆ బలమైన వాసనకు ఎలుకలు మీ ఇంటి వైపు చూడవు.

ఎలుకలు ఎక్కువగా బాల్కనీలు తోటల్లోనే ఆశ్రయం పొందుతూ ఉంటాయి. కాబట్టి మీ బాల్కనీని, పెరడును చెత్త వస్తువులతో నింపేయకండి. పొడవైన గడ్డి, కలప ముక్కలు, కంపోస్టు డబ్బాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి. ఇక్కడే ఎలుకలు తమ సంతానోత్పత్తి చేస్తాయి. కాబట్టి పచ్చికను కత్తిరించి చిన్నగా ఉండేలా చూసుకోండి. అక్కడ పండ్లు, ఇతర ఆహారాలు పడేయకండి. కూరగాయలు పండిస్తే ఎలుకలను దూరంగా ఉంచేందుకు చుట్టూ కంచె ఏర్పాటు చేసుకోండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×