BigTV English

Murugadoss: కమెడియన్ మూవీపై పడ్డ స్టార్ డైరెక్టర్.. రీమేక్ తప్ప మరో దిక్కు లేదా?

Murugadoss: కమెడియన్ మూవీపై పడ్డ స్టార్ డైరెక్టర్.. రీమేక్ తప్ప మరో దిక్కు లేదా?

Murugadoss:సినిమా ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాల హవా ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. నిజానికి ఈ రీమేక్ చిత్రాలు అనేవి ఈ కాలం నాటివి కాదు. ఎన్టీఆర్ (NTR), కృష్ణ (Krishna) లాంటి దిగ్గజ దివంగత హీరోల కాలం నుండే కొనసాగుతోంది. ఈ హీరోలు కూడా రీమేక్ చిత్రాలు చేసి సత్తా చాటిన రోజులు కూడా ఉన్నాయి. అందుకే ఏ భాషలో అయినా సరే ఒక సినిమా మంచి సక్సెస్ అందుకొని ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది అంటే కచ్చితంగా ఆ సినిమా రీమేక్ చేయడానికి డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైన నేపథ్యంలో ఈ రీమేక్ చిత్రాల హవా కాస్త తగ్గినా.. పాత చిత్రాలను మళ్లీ రీమేక్ చేయాలని ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఒక స్టార్ డైరెక్టర్ ఏకంగా కమెడియన్ మూవీను రీమేక్ చేయడానికి సిద్ధపడడంతో ఈ డైరెక్టర్ కి రీమేక్ తప్ప మరో దిక్కు లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పోయి పోయి కమెడియన్ మూవీని రీమేక్ చేయడం ఏంటి అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ డైరెక్టర్ ఎవరు? ఆ కమెడియన్ ఎవరు? ఏ మూవీ ని ఆయన ఏ భాషలో రీమేక్ చేయబోతున్నారు? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


సక్సెస్ కోసం ఆరాటపడుతున్న డైరెక్టర్ మురగదాస్..

కోలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న మురగదాస్ (Murugadoss )కి సరైన సక్సెస్ పడి ఎంతో కాలమవుతోంది. ఇటీవల బాలీవుడ్ లో ‘సికిందర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఈయనకు పెద్దగా వర్కౌట్ కాలేదు. మరొకసారి రొటీన్ సినిమా చేశాడనే విమర్శలు కూడా ఎదురయ్యాయి. అటు సల్మాన్ ఖాన్ (Salman Khan) ను ఈ సినిమాలో పెట్టినా సక్సెస్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ (Siva karthikeyan )తో ‘మదరాశి’ అనే భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడ. దీనికి తోడు ప్రచార చిత్రాలతో హైప్ కూడా క్రియేట్ అవుతోంది.సెప్టెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


రీమేక్ సినిమాలపై పడ్డ మురగదాస్..

ఈ సినిమా తర్వాత మరో రెండు చిత్రాలను ఆయన లైన్ లో పెట్టారు. ఈ రెండు చిత్రాలు కూడా రీమేక్ కావడం గమనార్హం. విక్రమ్ (Vikram) హీరోగా శశి గణేషన్ (Sasi Ganeshan) దర్శకత్వం వహించిన ‘కాంతస్వామి’ అనే సినిమాను మురగదాస్ రీమేక్ చేస్తున్నారు. అలాగే తెలుగులో యావరేజ్ గా నిలిచిన అల్లరి నరేష్ (Allari Naresh) ‘ఉగ్రం’ మూవీ ని కూడా రీమేక్ చేస్తున్నారు. నిజానికి తన కామెడీతో ప్రేక్షకులను అలరించే అల్లరి నరేష్.. తొలిసారి సీరియస్ యాంగిల్ లో యాక్షన్ థ్రిల్లర్ గా చేసిన చిత్రం ఉగ్రం. ఇది అల్లరి నరేష్ కెరీర్ కు బాగానే ఉపయోగపడ్డా.. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఇదే కథను మురగదాస్ రీమిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

యావరేజ్ సినిమాలతో సక్సెస్ కొడతాడా?

అంతేకాదు అటు కాంతస్వామి సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. ఇప్పుడు ఈ యావరేజ్ చిత్రాలను మురగదాస్ రీమేక్ చేయడమే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందులో హీరోలు ఎవరు? నటీనటుల ఎంపిక ఏ రేంజ్ లో చేయబోతున్నారు? అన్నది తెలియాల్సి ఉంది. అసలే సక్సెస్ కోసం ఆరాటపడుతున్న మురుగదాస్ ఇప్పుడు ఇలా యావరేజ్ సినిమాలను ఎంపిక చేసుకుని రీమేక్ చేస్తానని చెప్పడం ఆశ్చర్యంగా మారింది. మరి ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

ALSO READ:Lata Mangeshkar: చరిత్రలో నిలిచిపోయే గౌరవాన్ని అందుకున్న లతా మంగేష్కర్.. ఫోటో వైరల్!

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×