Foods For White Hair: ప్రస్తుతం చాలా మంది తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగు మారిన జుట్టుతో నానాపాట్లు పడుతున్నారు. తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కుంటున్న వారిలో చాలా మంది హెయిర్ కలర్స్ వాడుతుంటే మరి కొందరు షాంపూలతో పాటు, హెయిర్ ఆయిల్స్ ట్రై చేస్తుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఈ రోజుల్లో జుట్టు అకాల నెరసిపోయే సమస్య చాలా ఎక్కువైంది. చిన్న వయసులోనే జుట్టు రంగు మారుతోంది. దీనికి ప్రధాన కారణం సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడమే, ఎందుకంటే పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ , ప్రాసెస్డ్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దీంతో వారి శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అంతే కాకుండా జుట్టు పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, జన్యుపరమైన అంశాలు కూడా కారణం కావచ్చు. పోషకాహార లోపం కూడా తెల్లజుట్టు రావడానికి కారణం కావచ్చు.ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందుకే ప్రతి రోజు తినే ఆహారంలో తప్పకుండా కొన్ని పదార్థాలను తప్పకుండా చేర్చుకోవాలి. మరి ఏ ఆహార పదార్ధాలు తింటే జుట్టు తెల్లబడకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ:
తెల్లజుట్టు సమస్యతో మీరు ఇబ్బంది పడుతుంటే, మీరు మీ ఆహారంలో ఉసిరిని తప్పకుండా చేర్చుకోవాలి. దీన్ని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇది జుట్టు యొక్క పిగ్మెంటేషన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా జామకాయతో చేసిన హెయిర్ డైని అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
మీ ఆహారంలో నువ్వులను చేర్చుకోండి:
జుట్టు నల్లబడాలంటే నువ్వులను ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
కరివేపాకు తినండి:
కరివేపాకు తినడం వల్ల జుట్టు రంగు మారే ప్రక్రియ మందగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి జుట్టు కుదుళ్లకు మేలు చేస్తాయి. అంతే కాకుండా దీని వల్ల జుట్టు అంతర్గతంగా బలపడుతుంది. కరివేపాకు జుట్టును ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.
బాదం పప్పులు తినండి:
బాదంపప్పును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల తలపై కెరోటిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందులో ఉండే బయోటిన్ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బాదం తినడం వల్ల జుట్టుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఫలితంగా జుట్టు రాలకుండా ఉంటుంది.
Also Read: గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? అయితే ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి
వాల్ నట్స్ తినండి:
వాల్ నట్స్ తీసుకోవడం వల్ల జుట్టు నెరసిపోకుండా కాపాడుకోవచ్చు. ఇందులో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కణజాలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరమైన పోషక పదార్థాలను అందించి జుట్టు రాలకుండా చేస్తుంది. నట్స్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.