BigTV English

Bigg Boss Sonia: సోనియా కోసం అలాంటి పని చేసిన భర్త.. ట్రోల్స్ వైరల్..!

Bigg Boss Sonia: సోనియా కోసం అలాంటి పని చేసిన భర్త.. ట్రోల్స్ వైరల్..!

Bigg Boss Sonia:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఎంటర్టైన్మెంట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) దిగ్విజయంగా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ 8వ సీజన్లో పాల్గొన్న సోనియా ఆకుల(Sonia akula) ఇటీవలే తాను ప్రేమించిన యష్ (Yash ) ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు. పెళ్లి చేసుకున్న సాయంత్రానికి ‘ఇస్మార్ట్ జోడి 3’ లోకి వచ్చేసారు ఈ జంట. ఇక హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ పెళ్లికి పలువురు బుల్లితెర ప్రముఖులు బిగ్ బాస్ కంటెస్టెంట్ సహజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు సోనియా పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా రీసెంట్గా సోనియా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సోనియా కోసమే ఆమె భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారనే వార్త ఇప్పుడు సంచలనానికి తెరలేపింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో..ఈ విషయంపై భార్యాభర్తలిద్దరూ కూడా స్పందించారు.


సోనియా కోసమే మొదటి భార్యకు విడాకులు..

తాజాగా సోనియా భర్త యష్ మాట్లాడుతూ.. “ఈ విడాకుల గురించి నేను ఏమీ మాట్లాడను.. ఎందుకంటే సోనియా కోసమే నా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాను అన్నదానిలో నిజం లేదు. వ్యక్తిగత కారణాలవల్లే మేమిద్దరం విడాకులు తీసుకున్నాము. ఆ తర్వాతనే నా లైఫ్ లోకి సోనియా వచ్చింది. సోనియా నా కొడుకు విరాట్ ని అలాగే నా కుటుంబ సభ్యులను చాలా బాగా చూసుకుంటుంది. మేమిద్దరం కూడా సోనియాను గౌరవిస్తాము. ఆమెకు కూడా ఒక మంచి జీవితం ఉండాలని అనుకుంటున్నాము” అంటూ తెలిపారు.


క్లారిటీ ఇచ్చిన జంట..

ఇక సోనియా మాట్లాడుతూ..”నా గురించి యష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. నేను ఎవరితో ఎలా ఉంటాను.. ఎవరిని ఎలా ట్రీట్ చేస్తాను.. అన్ని విషయాలు కూడా వాళ్లకు తెలుసు. యష్ వాళ్ళ మేనత్త కైతే నేను పవన్ కళ్యాణ్ లాగా అంత ఇష్టము”అంటూ ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ జంట చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా సోనియా కోసమే తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు యష్ అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

సోనియా ఆకుల కెరియర్..

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కథ అందించిన ‘కరోనా వైరస్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఇందులో శ్రీకాంత్ అయ్యగార్ కూతురు శాంతి పాత్రలో నటించింది. అలాగే ‘ఆశ’, ‘ఎన్కౌంటర్’ వంటి సినిమాలలో నటించి మెప్పించింది. ముఖ్యంగా ‘ఆశ’ సినిమాలో బాధితురాలు ఆశా పాత్రలో సోనియా నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి అటు బుల్లితెర ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది కానీ నిఖిల్, పృథ్వీ తో ట్రయాంగిల్ లవ్ నడిపి హౌస్ లోకి వచ్చిన కొన్ని వారాలకే ఎలిమినేట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×