Church National Anthem| క్రిస్మస్ పండుగ వేడుకలు డెసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. భారతదేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్న చర్చీలు వెలుగులీనాయి. లైట్లు, క్రిస్మస్ స్టార్లతో పాటు ప్రాంతీయ సంస్కృతి ఉట్టిపడేలా రాత్రంతా క్రిస్మస్ వేడుకలు కొనసాగాయి. అయితే ఏసు ప్రభువు జన్మదినమైన క్రిస్మస్ సమయంలో చర్చిలలో ప్రార్థనా గీతాలు ఆలపిస్తారు. అయితే ఒక చర్చిలో మాత్రం ఆశ్చర్యకరంగా భారత దేశ జాతీయం గీతం పాడారు. ముంబై నగరంలోని ఒక ప్రముక చర్చిలో ఈ జాతీయ గీతం పాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ముంబైలోని ఆఫ్ఘన్ చర్చిగా పిలవబడే చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ది ఇవాంజెలిస్ట్ లో వైల్డ్ వాయిసెస్ కాయిర్ బృందం క్రిస్మస్ రాత్రి చాలా మృదువైన ట్యూన్ తో భారత దేశ జాతీయ గీతం జనగణ మనని ఆలపించింది. చర్చిలో కాయిర్ జాతీయ గీతం ఆలపించగానే క్రైస్తవ భక్తులందరూ లేసి నిలబడి స్వరం కలిపారు. ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read: జపాన్‌లో క్రిస్మస్ అంటే రెండో వాలంటైన్స్ డే.. ఆ రాత్రి..!
ఈ వీడియో చూసిన వారంతా సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. “ముంబైలో క్రిస్మస్ పండుగను ఇంత అందంగా జరుపుకుంటారని ఇప్పుడే తెలిసింది.” అని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజెన్ అయితే.. “ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వీడియో షేర్ చేసిన వారికి థ్యాంక్స్. మేము ప్రేమించే అసలైన ఇండియా అంటే ఇదే. మెర్రీ క్రిస్మస్” అని రాశాడు. ఇంకొక నెటిజెన్ .. వీడియో చూసి గూస్ “బంప్స్ వచ్చాయి. చాలా అద్భుతంగా ఉంది. మెర్రీ క్రిస్మస్. అందరూ ఏకస్వరంలో పాడితే అదో అందమైన అనుభూతి” అని కామెంట్ లో రాశాడు.
Stunning version of the national anthem by the Wild Voices choir at the Afghan Church on #Christmas eve in Mumbai tonight.#MerryChristmas pic.twitter.com/9VJ205rINZ
— Samar Halarnkar (@samar11) December 24, 2024
మరోవైపు జపాన్ లో మరో అద్భుతం జరిగింది. అక్కడ ఇస్కాన్ కృష్ణ భక్తులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హిందువులైన ఇస్కాన్ సభ్యులు, భక్తులు క్రిస్మస్ రోజున జపాన్ రాజధాని టోక్యోలో ప్రధాన కూడళ్లు, రోడ్లపై శాంతా క్లాస్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. సాధారణంగా వారంగా హరే కృష్ణ అంటూ ఏకస్వరంలో నినదిస్తూ కనిపిస్తారు. కానీ టోక్యో నగరంలోని ఇస్కాన భక్తులు మాత్రం శాంతా క్లాస్ ని గుర్తు చేస్తూ.. జింగిల్ బెల్స్ అంటూ పాడారు. పైగా వారంతా ఉకెలెలే డ్రమ్ వాయిస్తూ.. మృదంగం వాయిస్తూ రోడ్లపై కనిపించారు. వారిని రోడ్లపై వెళ్లేవారంతా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. కొందరైతే గ్రూపు వారితో కలిసి పాడారు.
ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు భారీగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ అయితే.. “వీరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి” అని రాస్తే.. మరొక నెటిజెన్ .. “రెండు మతాలను ఒకటిగా అందంగా బ్లెండ్ చేశారు.” అని కామెంట్ చేశాడు. ఇంకొక యూజర్.. “సెకులరిజం పీక్స్ లో ఉంది” అని రెస్పాండ్ అయ్యాడు.
మరోవైపు చాలా మంది సెలెబ్రిటీలు కూడా శాంతా క్లాస్ వేషం వేశారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్ మస్క్ శాంతా క్లాజ్ డ్రెస్ వేసుకొని బరువు తగ్గినట్లు కనిపించాడు. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బాలీవుడ్ నటి కృతి సనన్ తో శాంతా క్లాజ్ వేషంలో దర్శనమిచ్చి తన ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచాడు.