జుట్టు రాలిపోతున్న సమస్య ఆధునిక యువతలో ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ ఎక్కువ వెంట్రుకలు కోల్పోతున్నవారు మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. దీనికోసం హెయిర్ మాస్కులు వాడడం, రకరకాల నూనెలు ఉపయోగించడం, షాంపూలు, కండిషనర్లు ఇలా ఎక్కువగానే ఖర్చు చేస్తూ ఉంటారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే బాహ్య పోషణే కాదు, అంతర్గత పోషణ కూడా అవసరం. అంటే జుట్టుకు బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తినడం కూడా చాలా ముఖ్యం. మీరు బయట నుంచి జుట్టుకు ఎంత బలాన్ని ఇచ్చినా లోపల నుంచి అంటే చర్మం కింద నుంచి పోషణ అందితేనే అవి సక్రమంగా పనిచేస్తాయి. కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారాలు మీ మెనులో ఉండాలో తెలుసుకోండి.
ప్రోటీన్ నిండిన
జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. కాబట్టి ప్రోటీన్ ఉండే ఆహారాలు ప్రతిరోజు మీ ప్లేట్లో ఉండేలా జాగ్రత్త పడండి. గుడ్లు, చేపలు, చికెన్, పప్పు ధాన్యాలు వంటివి తినడం వల్ల జుట్టు బలంగా, మందంగా పెరుగుతుంది.
విటమిన్ సి
విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం కూడా చాలా ముఖ్యం. ఇది జుట్టుకు బలాన్ని ఇస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. నారింజ, జామ, కివి, టమోటోలలో, విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి మీ రోజువారి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి.
విటమిన్ ఇ
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి విటమిన్ ఇ కూడా ఎంతో ముఖ్యమైనది. జుట్టును ఇది హైడ్రేటెడ్ గా ఉంచి మెరిసేలా చేస్తుంది. విటమిన్ ఇ జుట్టుకు అందాలంటే మీరు ప్రతిరోజు గుప్పెడు బాదం పప్పులు, గుప్పెడు వాల్ నట్స్, గుప్పెడం పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం ఎంతో ముఖ్యం. వీటిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. జుట్టుకు మెరుపును అందిస్తుంది. పట్టు లాంటి జుట్టు మీకు సొంతం అవ్వాలంటే ఈ నట్స్‌ను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి.
ఇనుము లోపించడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది. మహిళల్లో అధికంగా ఇనుము లోపం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి నెల పీరియడ్స్ రూపంలో వారికి రక్త నష్టం జరుగుతుంది. కాబట్టి ఇనుము లోపం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఐరన్ కోసం ఆకుకూరలు తినాలి. ముఖ్యంగా పాలకూరను అధికంగా తినాలి. అలాగే బీన్స్, బీట్రూట్ లు తినడం ద్వారా కూడా ఎక్కువ ఇనుమును పొందవచ్చు. వీటిని ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఉత్తమం.
Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి !
మనసు శరీరానికి అత్యవసరమైన మరో పోషకం ఒమేగా త్రీ ఫ్యాటీ అమ్లాలు. ఇవి జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇవి చాలా తక్కువ ఆహారాలలో మాత్రమే ఉంటాయి. అవి అవిసె గింజలు, వాల్‌నట్స్, ఒమేగా త్రీ కొవ్వు చేపలు కాబట్టి వీటిని వారంలో కనీసం రెండుసార్లు తినేందుకు ప్రయత్నించండి. ఇవి జుట్టును బలంగా మారుస్తాయి. మీరు నెల రోజుల్లోనే మంచి మార్పును గమనిస్తారు.
జుట్టు పెరుగుదలకు కావలసిన మరొక పోషకం జింక్. జింక్ లాభం వల్ల కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జింక్ కోసం మీరు రకరకాల నట్స్, సీడ్స్, మాంసం, గుడ్లు వంటివి తింటూ ఉండాలి. ఇక్కడ చెప్పిన ఆహారాలు తినడం ద్వారా మీరు జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.