BigTV English

Jayasudha : ఆ దేవుడిని నా కళ్లతో చూశా… అందుకే అంత త్వరగా మతం మారిపోయా..

Jayasudha : ఆ దేవుడిని నా కళ్లతో చూశా… అందుకే అంత త్వరగా మతం మారిపోయా..

Jayasudha:సహజనటి జయసుధ (Jayasudha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో.. నటనతో.. చలాకీతనంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది. 1959 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించిన ఈమె.. ఎవరో కాదు.. ప్రముఖ దివంగత సినీనటి, నిర్మాత విజయనిర్మల (Vijay Nirmala) మేనకోడలు. సుజాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత జయసుధ గా పేరు మార్చుకొని 1972లో లక్ష్మీ దీపక్ (Lakshmi Deepak) దర్శకత్వంలో వచ్చిన ‘పండంటి కాపురం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత తన నటనతో సహజత్వం ఉట్టిపడేలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. దాదాపుగా 300కు పైగా సినిమాలలో నటించింది. అందుకు 20 తమిళ్ సినిమాలు, 8 మలయాళం సినిమాలు, ఒక కన్నడ సినిమాతో పాటు 3 హిందీ సినిమాలు కూడా వున్నాయి.


ఆ సమయంలో చనిపోయాననుకున్నా – జయసుధ

ఒక్క దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలోనే 25 సినిమాలు చేసిన ఈమె.. దివంగత దర్శకులు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) దర్శకత్వంలో ఏకంగా 27 సినిమాలు చేసి అబ్బురపరిచింది. అంతేకాదు ఒకే ఏడాదిలో ఈమె నటించిన 25 సినిమాలు విడుదలయ్యాయి అంటే.. ఈమె ఎంత బిజీ షెడ్యూల్ అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈమె ఒకానొక సమయంలో చేతిలో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక తర్వాత మానసికంగా కృంగిపోయింది. ఒకానొక సమయంలో ఆల్మోస్ట్ చనిపోయాను అనుకునే సమయంలో సడన్ గా తాను దేవుడిని చూశానని.. అందుకే మతం మార్చుకున్నాను అంటూ తాజా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


నా కళ్ళతో సముద్రంలో జీసస్ ని చూశాను – జయసుధ

అసలు విషయంలోకి వెళ్తే 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్రకు దాయాది అయిన నితిన్ కపూర్ (Nithin Kapoor) ను వివాహం చేసుకుంది జయసుధ. ఇక 1986లో మొదటి కొడుకు నిహార్ జన్మించగా.. 1990లో శ్రేయంత్ పుట్టారు. ఇకపోతే వివాహం జరిగిన తర్వాత అందరిలాగే ఈ జంట కూడా బ్యాంకాక్ కు హనీమూన్ వెళ్లారట. అక్కడ జరిగిన ఒక సంఘటనే తనను మతం మార్చుకునేలా చేసిందని జయసుధ తెలిపింది. జయసుధ మాట్లాడుతూ.. “నేను.. నా భర్త నితిన్ తో కలిసి బ్యాంకాక్ కి హనీమూన్ వెళ్ళాము. అందులో భాగంగానే నా భర్తతో కలిసి సముద్రంలో రైడ్ కు వెళ్ళాను. అక్కడ నేను లైవ్ జాకెట్ వేసుకోలేదు. కానీ సడన్గా బోట్ అదుపుతప్పడంతో నేను నీళ్లలో పడిపోయాను. దాదాపు సముద్రం మధ్య భాగానికి చేరుకున్నాము. ఇక ఆ సమయంలో నేను చనిపోయానని అనుకున్నాను. సడన్గా నీళ్లలో నాకు జీసస్ కనిపించాడు. నా కళ్ళతో నేను ఆయనను చూశాను. సాధారణంగా ఎవరైనా ప్రాణాపాయం ఉన్నప్పుడు తమకు ఇష్టమైన వారిని తలుచుకుంటారు. నిజానికి నేను ఒక హిందువుని.. శివుడు, అయ్యప్ప లాంటి దేవుళ్లను ఎక్కువగా విశ్వసిస్తాను. కానీ ఆ సమయంలో నాకు వాళ్లు గుర్తుకు రాలేదు. సడన్గా జీసస్ అని అరవగానే నా కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షమయ్యారు. అలా నా కళ్ళతో నేను జీసస్ ని చూశాను. అయితే నేను హిందూ దేవుళ్లను అనుసరిస్తాను. అలాంటి నా నోటి నుండి జీసస్ పేరు రావడం, ఆయన నా కళ్ళ ముందు కనిపించడం అంతాఒక అద్భుతం లా జరిగిపోయింది”.

ALSO READ:Mamitha Baiju: ఏకంగా స్టార్ హీరోతో రొమాన్స్ కి సిద్ధమైన ప్రేమలు బ్యూటీ.. లక్ మామూలుగా లేదుగా..!

ఆ ఇన్సిడెంట్ జరిగిన 16 ఏళ్ళకు మతం మారాను..

“అంతే సముద్రంలో పడిపోయిన నేను సడన్గా బయటకి వచ్చేసాను. అటు నా ముక్కులోకి కానీ, నోట్లోకి కానీ ఒక్క చుక్క నీళ్ళు కూడా వెళ్లలేదు. ఇక అప్పుడే అనుకున్నాను. ఇక నేను జీసస్ కు సరెండర్ అయ్యే సమయం వచ్చింది అని. కానీ అప్పుడే నేను ఆయనకు సరెండర్ అవ్వాలేదు. సముద్రంలో మునిగిపోయి.. బయటకు వచ్చిన 16 సంవత్సరాల తర్వాత నేను మతం మార్చుకున్నాను. వాస్తవానికి నాకు 50 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నీకు సరెండర్ అవుతానని జీసస్ కి చెప్పాను. కానీ 42 ఏళ్ల వయసులోనే నేను ఆయనకు సరెండర్ అయ్యాను. వాస్తవానికి ఇంకా 10 సంవత్సరాల పాటు ఆయన నా కోసం ఎదురు చూడాలి. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన 16 సంవత్సరాలకే నేను ఆయనకు సరెండర్ అయ్యాను.అంటూ జయసుధ తెలిపింది. ముఖ్యంగా సినిమాలలో అవకాశాలు లేకపోవడం, ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లేనేమో నేను త్వరగా ఆయనను నమ్మాను” అంటూ కూడా తెలిపింది జయసుధ. ఇక ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×