Glycerin For Skin: గ్లిజరిన్ ( వాసిలిన్ ) గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. చలికాలంలో మాత్రమే దీనిని పొడి చర్మానికి ఉపయోగిస్తారు. కానీ సరిగ్గా అప్లై చేస్తేజజ ఇది ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో.. వేసవిలో కూడా సహజమైన మెరుపును ఇవ్వడంలో సహాయపడుతుంది. అన్ని చర్మ రకాలకు కూడా గ్లిజరిన్ ఉపయోగపడుతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం గ్లిజరిన్ ఎలా ఉపయోగించాలి. ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లిజరిన్ ఎలా అప్లై చేయాలి ?
గ్లిజరిన్ , రోజ్ వాటర్:
రోజ్ వాటర్ తో గ్లిజరిన్ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తేమ అందడమే కాకుండా సహజ టోనర్‌గా కూడా ఇది పనిచేస్తుంది. శుభ్రమైన స్ప్రే బాటిల్‌లో రెండింటినీ సమాన మోతాదులో కలిపి, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ముఖంపై స్ప్రే చేయండి. ఇది మీ చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుంది. అంతే కాకుండా అలసటను తగ్గిస్తుంది.
గ్లిజరిన్, అలోవెరా జెల్:
వేసవిలో కొన్ని రకాల మాయిశ్చరైజర్లు చర్మాన్నిజిడ్డుగా మారుస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. గ్లిజరిన్ , కలబంద జెల్ లతో తయారు చేసిన మిశ్రమం మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. రెండింటినీ సమాన పరిమాణంలో కలిపి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అంతే కాకుండా మొటిమల వంటి సమస్యలు రాకుండా రక్షిస్తుంది.
గ్లిజరిన్, నిమ్మకాయ:
మీ చర్మం ఎండ వల్ల నిస్తేజంగా లేదా టాన్ గా మారితే.. నిమ్మరసాన్ని గ్లిజరిన్ తో కలిపి రాయడం చాలా మంచి అవకాశం. ఈ మిశ్రమం చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా క్రమంగా చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. కానీ గుర్తుంచుకోండి.. రాత్రిపూట మాత్రమే దీన్ని అప్లై చేసి ఉదయం ముఖం కడుక్కోండి.
గ్లిజరిన్ , తేనె:
తేనె, గ్లిజరిన్ రెండూ చర్మాన్ని తేమగా చేస్తాయి. వీటితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేసి ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్లిజరిన్ తో చర్మ మసాజ్:
అరచేతుల్లో కొద్దిగా గ్లిజరిన్ తీసుకొని దానితో ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల చర్మ నాణ్యత మెరుగుపడుతుంది. మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ పద్ధతిని అవలంబించడం చాలా మంచిది.
గ్లిజరిన్ , దోసకాయ జ్యూస్:
దోసకాయ జ్యూస్ చర్మాన్ని చల్లబరుస్తుంది. దానికి కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపినప్పుడు అది అద్భుతమైన ఫేస్ ప్యాక్ లాగా మారుతుంది. దీనిని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని తాజాగా మారుస్తుంది. అంతే కాకుండా ఎండ నుండి కూడా రక్షిస్తుంది.
Also Read: ఈ ఆయిల్స్ వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు !
గ్లిజరిన్ ఐస్ క్యూబ్స్:
రోజ్ వాటర్ , గ్లిజరిన్ కలిపి ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేసి.. తర్వాత రోజు ఉదయం ఈ క్యూబ్స్ తో మీ ముఖాన్ని తేలికగా మసాజ్ చేయండి. ఇది ముఖానికి తక్షణ చల్లదనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ముఖ రంధ్రాలను బిగించి ముఖం మెరిసేలా చేస్తుంది. ఈ పద్ధతి సమ్మర్‌లో చాలా ఉపశమనం కలిగిస్తుంది.