Ustaad Bhagat Singh Update : ఇన్నాళ్లు పవన్ డిప్యూటీ సీఎంగా ఉండి చాలా పనులు చేశాడు. అయినా.. ఆయన అభిమానులకు ఏదో తెలియని వెలితి. ఇప్పుడు ఆ వెలితిని పూడ్చుకుంటూ వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. నిన్నటి నుంచి ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే ఆ సెట్స్ లోకి పవన్ అడుగుపెట్టబోతున్నాడు. ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా గత 6 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉంటుంది.
డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ తో సినిమా చేయడానికి అగ్రిమెంట్ 6 ఏళ్ల క్రితం కుదిరింది. గద్దలకొండ గణేష్ అనే సినిమా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కోసం భవదీయుడు భగత్ సింగ్ అంటూ ఓ సినిమా అనౌన్స్ చేశారు. తర్వాత ఆ సినిమా అండ్ ఆ స్టోరీని మార్చేసి… ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరో అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
కానీ, ఇన్నాళ్లు అవుతున్నా… సెట్స్ పైకి కూడా రాలేకపోయింది. అప్పుడెప్పుడో… సంవత్సరం కింద ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అది కూడా ఆ సిన్ కోసమే ప్రత్యేకంగా షూట్ చేశారట. అంతే కానీ, ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎలాంటిది జరగలేదని సమాచారం. తాజాగా పవన్ ఇప్పుడు పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్న నేపథ్యంలో అందరి కళ్లు ఈ మూవీపై పడ్డాయి.
ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్…
పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, అటు హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ పూర్తి కావడం, ఇటు ఓజీ షూటింగ్ కూడా స్టార్ట్ కావడంతో… ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట. ఓజీ అయిన వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అందు కోసం హరీష్ అన్నీ సెట్ చేసుకుంటున్నాడు.