Homemade Hair Oil: జుట్టు రాలడం, తెల్లబడటం ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. పెద్దలు అయినా, పిల్లలు అయినా, ప్రతి ఒక్కరి జుట్టు వారి వయస్సుకు ముందే తెల్లగా మారడం ప్రారంభిస్తుంది. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, పోషకాహార లోపం కూడా దీనికి కారణం. ఇదిలా ఉంటే తెల్ల జుట్టును దాచుకోవడానికి చాలా మంది వివిధ రకాల హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి ఎలాంటి హెయిర్ ఆయిల్స్ వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టుకు ఆర్గానిక్ ఆయిల్స్:
అలోవెరా జెల్ – కొబ్బరి నూనె:
కలబంద జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడం, చుండ్రును నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది పొడిబారిన తలకు తేమను కూడా అందిస్తుంది. ఈ నూనె తయారు చేయడానికి.. అర కప్పు కలబంద జెల్ తీసుకొని, అర కప్పు కొబ్బరి నూనెతో కలపండి.
తరువాత ఆ మిశ్రమాన్ని 5 నుండి 7 నిమిషాలు తక్కువ మంట మీద వేడి చేసి.. చల్లబడిన తర్వాత దానిలో 5 చుక్కల రోజ్మేరీ నూనె వేసి బాగా కలపండి. ఈ నూనెను ఉపయోగించే ముందు 2 వారాల పాటు గాజు సీసాలో నిల్వ చేయాలి.
కరివేపాకు, కొబ్బరి నూనె:
చాలా సంవత్సరాలుగా కొబ్బరి నూనెను జుట్టు పెరుగుదలకు ఉపయోగిస్తున్నారు. దీనిని తయారు చేయడానికి, తగిన మోతాదులో కరివేపాకును తీసుకుని దానిని కొబ్బరి నూనెలో 30 నిమిషాలు ఉడకబెట్టి.. ఇప్పుడు నూనెను చల్లబరచండి. దీని తరువాత, నూనెను వడకట్టి గాజు సీసాలో నిల్వ చేయండి. వారానికి 3 సార్లు దీనిని అప్లై చేయండి. ఈ నూనెను అప్లై చేయడం ద్వారా మీరు తెల్ల జుట్టు సమస్య నుండి బయటపడతారు.
అల్లం, నువ్వుల నూనె:
నువ్వుల నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నువ్వుల నూనెను జుట్టుకు అప్లై చేయడం ద్వారా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా ఈ నూనె తయారు చేయడానికి, తగిన మోతాదులో అల్లం రుబ్బి, ఒక కప్పు నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ నూనెను చల్లబరిచి.. ప్రతిరోజూ మీ తలకు మసాజ్ చేయండి.
నిమ్మకాయ, బాదం నూనె:
బాదం నూనె మీ జుట్టుకు పోషణనిస్తుంది. ఈ నూనె వాడటం వల్ల మీ జుట్టు మందంగా , నల్లగా మారుతుంది. ఈ నూనె అప్లై చేయడానికి.. ఒక చెంచా నిమ్మకాయను 2 చెంచాల నూనెలో కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మూలాల నుండి నల్లగా మారుతుంది.
Also Read: సమ్మర్‌లో రోజ్ వాటర్ ఇలా వాడితే.. మచ్చలేని చర్మం
జాస్మిన్, జోజోబా హెయిర్ ఆయిల్ :
ఈ నూనెను తయారు చేయడానికి.. ఒక చుక్క జాస్మిన్ నూనె , 10 నుండి 12 చుక్కల జోజోబా నూనెను కలిపాలి. తర్వాత దీనిని మీ జుట్టుకు బాగా అప్లై చేసి చేతులతో 15 నుండి 20 నిమిషాలు మసాజ్ చేయండి. అరగంట తర్వాత జుట్టును షాంపూ తో వాష్ చేయండి. ఇది జుట్టు రాలడం, చివరలు చిట్లడం, జుట్టు తెల్లబడటం వంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.