BigTV English

Black Hair: అర్జెంటుగా బయటికి వెళుతున్నారా? మీ తెల్ల జుట్టును ఐదు నిమిషాల్లో ఇలా నల్లగా మార్చేయండి

Black Hair: అర్జెంటుగా బయటికి వెళుతున్నారా? మీ తెల్ల జుట్టును ఐదు నిమిషాల్లో ఇలా నల్లగా మార్చేయండి

మగవారి జుట్టు కన్నా ఆడవారి జుట్టు పైనే అందరి కళ్లు ఉంటాయి. అందుకే ఆడవాళ్లు రకరకాల హెయిర్ స్టైలింగ్ పద్ధతులు పాటిస్తారు. ఒక్కొక్కసారి అర్జెంటుగా బయటకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సమయంలో జుట్టు తెల్లగా ఉంటే వెంటనే రంగు వేయలేక ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఐదు నిమిషాల్లోనే జుట్టు నల్లగా మార్చే చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే సులువుగా పని అయిపోతుంది.


జుట్టు తెల్లగా మారడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వయసు మీరడంతో పాటూ, ఒత్తిడి అధికమైనా కూడా జుట్టు ఇలా రంగు మారిపోతూ ఉంటుంది. జుట్టు రంగు మారిపోయేటప్పుడు సెలూన్ కు వెళ్లి సమయం కేటాయించి రంగు వేయించుకునేవారు ఎంతోమంది. అలాగే బయట దొరికే ఉత్పత్తులను కొని ఇంట్లోనే రంగు వేసుకొని ఒక అరగంట పాటు ఆగి స్నానం చేసి అప్పుడు బయటకి వెళుతూ ఉంటారు. కానీ అంత సమయం లేనప్పుడు ఏం చేయాలో తెలుసుకోండి.

రూట్ టచ్ అప్ స్ప్రేలు
మీకు జుట్టుకు రంగు వేయడానికి ఎక్కువ సమయం లేకపోతే రూట్ టచ్ అప్ స్ప్రే కొని ఇంట్లో పెట్టుకోండి. ఈ స్ప్రేను మీ తెల్ల జుట్టుపై చల్లితే సరిపోతుంది. అప్పటికప్పుడే జుట్టు రంగు నల్లగా మారిపోతుంది. ఈ బాటిల్‌ను బాగా షేక్ చేసి జుట్టుపై స్ప్రే చేసుకోవాలి. ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత దువ్వుకోండి. రెండు నిమిషాలలో మీ నల్లటి జుట్టు రెడీ అయిపోతుంది. మీకు నచ్చిన షేడ్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.


హెయిర్ మస్కారా
హెయిర్ మస్కారా కూడా మార్కెట్లో లభిస్తుంది. దీన్ని కూడా జుట్టుకి అప్లై చేయడం ద్వారా అప్పటికప్పుడు జుట్టు రంగును మార్చుకోవచ్చు. దీన్ని జుట్టుపై అప్లై చేయడానికి మూడు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతుంది. దీన్ని అప్లై చేశాక ఒకసారి బాగా దువ్వుకొని తర్వాత స్టైలింగ్ చేసుకోవచ్చు.

టచ్ అప్ స్టిక్, హెయిర్ పౌడర్
జుట్టుకు రంగు వేసేందుకు డ్రై ఉత్పత్తులు కూడా దొరుకుతున్నాయి. వాటిలో హెయిర్ కలర్ పౌడర్, టచ్ అప్ స్టిక్ వంటివి కూడా ఉన్నాయి. టచ్ అప్ స్టిక్‌తో మీ జుట్టు బాగా రుద్దండి. దీన్ని తడపాల్సిన అవసరం లేదు. రెండు మూడు నిమిషాల పాటు టచ్ అప్ స్టిక్ తో జుట్టును బాగా రుద్దాలి. జుట్టు నల్లగా మార్చేస్తుంది. లేదా హెయిర్ కలర్ పౌడర్ ను తలకు రాసుకున్నా చాలు. అప్పటికప్పుడు రంగు మారిపోతుంది.

హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లు
హెయిర్ ఎక్స్‌టెన్షన్‌లను కూడా బయట దొరుకుతున్నాయి. అలాంటి నల్లటి హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొని మీ తెల్లటి జుట్టుపై అతికించేయండి. అప్పుడు రంగు వేయాల్సిన అవసరం లేదు. జుట్టు కూడా ఒత్తుగా కనిపిస్తుంది. ఈ హెయిర్ ఎక్స్ టెన్షన్లు కూడా సహజమైన జుట్టు లాగే కనిపిస్తాయి క్లిప్పులు పెట్టుకోవడానికి మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది.

మీరు చాలా బిజీగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు పైన చెప్పిన పద్ధతులన్నీ చాలా సులువుగా పాటించవచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలికమైనవే. అప్పటికప్పుడు ఉపయోగపడేవే. పూర్తిగా జుట్టు రంగును మార్చలేవు. అలాగే కొన్ని రోజులు వరకు కూడా జుట్టు రంగును నలుపుగా ఉంచలేవు. కాబట్టి మీ ప్రయాణం పూర్తయిన తర్వాత మీ జుట్టుకు ఏ రంగు కావాలో వాటిని వేసుకోవడం మంచిది. పైన చెప్పిన పద్ధతులను పాటించాక తలకు స్నానం చేసి జుట్టును బాగా ఆరబెట్టుకోండి. ఆ తరువాతే మీరు రెగ్యులర్ గా వాడే రంగులు వేసుకోవడం ఉత్తమం.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×