Chakali Ilamma Grand daughter Murder: రాను రాను మానవత్వం మంట గలిసిపోతున్నాయి. ప్రేమించినవాడి కోసం కట్టుకున్న భర్తను, కన్నతల్లినే కడతేరుస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదోవన వెళుతూ.. కన్నవారి ప్రాణాలనే తీస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని కన్నకూతురే కిరాతంగా హతమార్చింది. నువ్వు చేసేది తప్పు అని మందలించినందుకు కనికరం లేకుండా.. కర్కశంగా కడతేర్చింది. తల్లితో ఉన్న బంధాన్ని మరిచి.. ప్రియుడి సహకారంతో అతి కిరాతకానికి ఒడిగట్టింది. కన్న పేగు బంధాన్ని, పెంచిన ప్రేమను మరిచి కసాయిలా మారింది ఓ కూతురు. తన సుఖానికి అడ్డు వస్తుందని అతి దారుణానికి ఒడిగట్టింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది.. 16 ఏళ్ల కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో.. ప్రియుడు శివ, అతని తమ్ముడితో కలిసి తల్లిని హత్య చేసింది. గొంతు నులిమి, తలపై రాడ్‌తో కొట్టి.. దారుణంగా ప్రాణాలు తీసింది. నిందితురాలు పదో తరగతి చదువుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారు.
8 నెలల కిందట నల్గొండకు చెందిన శివతో బాలికకు పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. దాంతో ఆమె తల్లి అంజలి.. పదో తరగతికే ప్రేమ ఏంటని మందలించింది. వారం కిందట శివతో వెళ్లిపోయిన బాలిక, 3 రోజుల కిందటే ఇంటికి తిరిగొచ్చింది. తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసింది. నిన్న సాయంత్రం నల్గొండ నుంచి వచ్చిన బాలిక ప్రియుడు శివ.. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో ఆమె ముఖాన్ని కప్పేశాడు. కూతురు వెంటనే సుత్తి తీసుకుని తల్లి తలపై కొట్టింది. శివ తమ్ముడు యశ్వంత్ అంజలి గొంతు కోయడంతో.. ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
Also Read: కోచ్ కాదు.. కామాంధుడు.. 10 మంది బాలికలపై..
కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతురాలు చాకలి ఐలమ్మ ముని మనవరాలు. మహబూబాద్ చెందిన అంజలి 20 ఏళ్లుగా జీడిమెట్లలో నివాసం ఉంటున్నారు. ఆమె మహిళా మండలిలో కూడా పనిచేస్తుంది. కాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల క్రితమే బాలికకు ఇన్‌స్టాలో శివ అనే వ్యక్తికి పరిచయం అయ్యాడు. పదవతరగతికే పెళ్లి ఏంటని తల్లి అంజలి మందలించింది. వారం క్రితమే శివతో ఆ యువతి వెళ్లిపోయింది. దీంతో తల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో.. మూడురోజుల క్రితమే బాలిక ఇంటికి తరిగి ఇంటికి వచ్చింది.