E-Paper
Advertisement

స్లీపర్ బస్సుల్లో వరుస అగ్నిప్రమాదాలు..బస్సులో మంటలు చెలరేగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

స్లీపర్ బస్సుల్లో వరుస అగ్నిప్రమాదాలు..బస్సులో మంటలు చెలరేగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?
Advertisement

Sleeper bus fire safety precautions: ప్రస్తుత రోజుల్లో లాంగ్ జర్నీల కోసం రైళ్లు లేదా కార్ల కంటే ప్రైవేట్ స్లీపర్ బస్సుల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. టికెట్లు ఈజీగా దొరకడం, సౌకర్యవంతమైన బెడ్స్ ఉండటంతో ప్రయాణికులు వీటిని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. కానీ..ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న బస్సు అగ్నిప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని సార్లు క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమవడం, అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోవడం గుండెల్ని పిండేస్తున్నాయి. గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాలలో జరిగిన ఘోర ప్రమాదాలు మనకు ఒక హెచ్చరిక లాంటివి.మరి..స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మనం ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి?

చాలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వైరింగ్ మార్పులు చేయడం, అనధికారికంగా.. ఎలక్ట్రిక్ పరికరాలు లేదా ఛార్జింగ్ పాయింట్లు అమర్చడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. అలాగే బస్సుల్లో అదనపు లగేజీని నింపడం, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ సరిగ్గా పని చేయకపోవడం ప్రాణనష్టానికి ప్రధాన కారణం అవుతున్నాయి.

ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కాపాడే ముఖ్యమైన చిట్కాలు:

Advertisement

ఎమర్జెన్సీ ఎగ్జిట్ గమనించడం:

మీరు బస్సు ఎక్కిన వెంటనే సీట్లో కూర్చోగానే ముందుగా ఆ బస్సులో ఎమర్జెన్సీ విండోస్ లేదా ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడం చాలా ముఖ్యం. రాత్రి సమయంలో లైట్లు అన్నీ ఆరిపోయినప్పుడు సడన్‌గా చీకటి పడితే దారి వెతుక్కోవడం కష్టం అవుతుంది.

అద్దాలు పగలగొట్టే సేఫ్టీ హ్యామర్ :

Advertisement

ప్రతి స్లీపర్ బస్సులోనూ.. అద్దాలు పగలగొట్టడానికి చిన్న హ్యామర్ ఉంటుంది. అది ఎక్కడ ఉందో గమనించండి. అత్యవసర సమయాల్లో.. తలుపులు తెరుచుకోకపోతే.. ఆ హ్యామర్‌తో కిటికీ అద్దాలను పగలగొట్టి బయటపడొచ్చు.

వస్తువులు ముఖ్యం కాదు:

ఒకవేళ బస్సులో మంటలు చెలరేగి పొగలు వస్తే.. మీ లగేజీ బ్యాగులు, ల్యాప్‌టాప్‌లు లేదా డబ్బుల కోసం సమయం వృధా చేయకండి. క్షణాల వ్యవధిలో బస్సు నుంచి కిందకు దూకడం లేదా బయట పడటమే మీ మొదటి ప్రాధాన్యత కావాలి.

Also Read: లేడీస్ సేఫ్టీ అలెర్ట్..రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!

ప్రాణాలను రక్షించే లోయర్ బెర్త్ :

మీకు వీలైతే లాంగ్ జర్నీల్లో.. అప్పర్ బెర్త్ కంటే లోయర్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రమాదం జరిగిన క్షణంలో అప్పర్ బెర్త్ నుంచి కిందకు దూకడం లేదా బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని.

ప్రయాణికులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు:

బస్సు ఎక్కే ముందే.. ఆ బస్సు ఫిట్‌నెస్, ట్రావెల్స్ సర్వీస్ నమ్మదగిందా కాదా అని చూసుకోవడం మంచిది. అలాగే ప్రయాణ సమయంలో.. మంటలు లేదా పొగ వాసన వస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేయాలి.

సౌకర్యం ముఖ్యామే కానీ.. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. స్లీపర్ బస్సు ప్రయాణాల్లో కొద్దిపాటి అప్రమత్తత, ముందు చూపు ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Tags

Related News

లేడీస్ సేఫ్టీ అలెర్ట్..రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!

కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

వివాహ బంధంలో సమస్యలు.. విడాకుల పరిస్థితి నివారించడానికి 7 సూత్రాలు

స్టైలిష్‌గా కనిపించేందుకు బ్రాండెడ్ డ్రెస్‌ అవసరం లేదు.. తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషన్ టిప్స్

“నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

Big Stories

Advertisement
×