E-Paper
Advertisement

నమ్మండి.. సాయం చేశా, ఇదిగో ప్రూఫ్.. పాపం సాయి ధరమ్ తేజ్!

నమ్మండి.. సాయం చేశా, ఇదిగో ప్రూఫ్.. పాపం సాయి ధరమ్ తేజ్!
Advertisement

Sai Dharam Tej: సాయి ధరంతేజ్ సినిమాల పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)సోషల్ మీడియా వేదికగా తనకు రోడ్డు ప్రమాదం జరిగి ఐదు సంవత్సరాలు పూర్తి అయిందని అయితే నేను ఎంతో స్ట్రాంగ్ గా నిలబడే ఉన్నానని తనకు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే మీ అందరి ప్రేమ ఆశీస్సుల వల్లే తాను తిరిగి ఈరోజు మీ ముందు ఉన్నానని ఇది నాకు పునర్జన్మ అంటూ ఒక నోట్ విడుదల చేశారు.

సాయి తేజ్ ను కాపాడిన సయ్యద్….

ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ తనకు యాక్సిడెంట్ జరగడం, ఈ ప్రమాదం నుంచి బయటపడడం తన పునర్జన్మ లాంటిదని చెప్పడంతో ఈ ప్రమాదంలో తనని కాపాడిన సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ (Syed Abdul farhan) విషయాన్ని కూడా అభిమానులు బయటకు తీసుకువచ్చారు. సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురి కావడంతో ఈ ప్రమాదానికి గమనించిన సయ్యద్ అబ్దుల్ వెంటనే స్పందించి అంబులెన్స్ కి ఫోన్ చేయడం హాస్పిటల్ కి తీసుకెళ్లడం వంటివి చేశారు. ఇలా తన ప్రాణాలు కాపాడిన సయ్యద్ అబ్దుల్ కు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం చేయలేదంటూ విమర్శలు రావడంతో మరోసారి సాయి ధరమ్ తేజ్ స్పందించారు.

సయ్యద్ అబ్దుల్ కు ఆర్థిక సాయం చేశాను..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్ గురించి ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్కరికి తాను తెలియజేయడం ఏమనగా ఇప్పటికే అతనికి నేను ఆర్థికంగా సహాయం చేశాను అదేవిధంగా తనకు కుటుంబ బాధ్యతలు ఉన్నందున ఉద్యోగం పై దృష్టి పెట్టడం కోసం తనని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టవద్దని కోరాడు. అందుకే ఈరోజు నేను పెట్టిన మెసేజ్ నాకు ఆశీర్వాదాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పడం కోసమేనని సాయి తేజ్ వెల్లడించారు .

Advertisement

ఇకపోతే చాలామంది అంబులెన్స్ డ్రైవర్ గురించి డాక్టర్ల గురించి కూడా అడగవచ్చు నేను స్పృహలోకి వచ్చిన తర్వాత చేసిన మొదటి వీడియోలో నా ఆరోగ్యం గురించి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాను. ఇప్పుడు సయ్యద్ విషయంలో నన్ను దూషిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అందిస్తున్న ఈ విలువైన ఆశీర్వాదాలకు నేను కృతజ్ఞుడివి. ఎప్పటిలాగే మీరు ఏ రూపంలో చూపించిన మీ ప్రేమ, దయ స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉందంటూ సయ్యద్ కు సహాయం చేయలేదు అంటూ వస్తున్న విమర్శలపై ఈయన స్పందిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. గతంలో సయ్యద్ కూడా మెగా ఫ్యామిలీ తనకు హెల్ప్ చేశారన్న ఉద్దేశంతో ఎక్కడ ఉద్యోగం ఇవ్వలేదని అందుకే ఇలాంటి వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ కూడా కోరిన సంగతి తెలిసిందే.

Also Read: జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

Related News

బాలయ్య భామను చూస్తే చూపు తిప్పుకోలేం.. ఏం అందమో!

ఆ సినిమా చేసి తప్పు చేసాను.. సదా అవకాశాలు కోల్పోవడానికి అదే కారణమా?

ప్యారడైజ్‌లో కేసీఆర్‌.. చూసి షాకవుతున్న ఆడియన్స్!

ఐదేళ్ల తరువాత కూడా నిలబడే ఉన్నాను..చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగా హీరో!

సందీప్ మాటలను నిజం చేయాలనిపిస్తోంది – ఫరియా అబ్దుల్లా

‘ప్యారడైజ్’ ఎక్కడ తేడా కొట్టిందో తెలుసా?

నూతన బాధ్యతలు చేపట్టిన మెగా కోడలు ఉపాసన!

Big Stories

Advertisement
×