E-Paper
Advertisement

లేడీస్ సేఫ్టీ అలెర్ట్..రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!

లేడీస్ సేఫ్టీ అలెర్ట్..రాత్రి ప్రయాణాల్లో ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!
Advertisement

Women night travel safety tips: ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉద్యోగాలు, ప్రయాణాలు చేయడం కూడా సాధారణమైపోయింది. ఇలా రాత్రి సమయాల్లో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణ వేళల్లో మహిళలు కొన్ని పొర పాట్లను అస్సలు చేయకూడదు. అదే సమయంలో మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్‌ను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండొచ్చ.. రాత్రి ప్రయాణాల్లో పాటించాల్సిన  ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాత్రి ప్రయాణాల్లో మహిళలు చేయకూడని పొరపాట్లు:

ఏ రూట్లలో పడితే ఆ రూట్లో వెళ్లడం:

Advertisement

రాత్రి వేళల్లో ఇంటికి వెళ్లేటప్పుడు లేదా ప్రయాణించేటప్పుడు.. ఎవరికీ సరిగ్గా తెలియని, చీకటిగా ఉండే షార్ట్‌కట్ దారులను ఎంచుకోవడం చాలా ప్రమాదకరం. ఎంత తొందర ఉన్నప్పటికీ.. ఎప్పుడూ జన సంచారం ఉండే, వెలుతురు ఉన్న మెయిన్ రోడ్స్ గుండానే ప్రయాణించాలి.

అపరిచితులను గుడ్డిగా నమ్మడం:

ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు ఎదురైనప్పుడు లేదా ఆటో, క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత వివరాలు, ఇంటి అడ్రస్ లేదా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు వెంటనే షేర్ చేసుకోకూడదు. కొంత మంది చూపించే నకిలీ సానుభూతిని నమ్మి మోసపోకూడదు.

ఫోన్ బ్యాటరీ, ఇంటర్నెట్ లేకపోవడం:

Advertisement

ప్రయాణం చేసే ముందు ఫోన్ పూర్తిగా చార్జ్ అయిందా.. లేదా అని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి సమయంలో సడన్‌గా .. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అత్యవసర సమయాల్లో ఎవరినీ అడగలేము. అలాగే మొబైల్ డేటా ఎప్పుడూ ఆన్‌లో ఉండేలా చూసుకోవాలి.

లైవ్ లొకేషన్ పోస్ట్ చేయడం:

తాము ఎక్కడ తిరుగుతున్నాము.. ఏ సమయంలో ఏ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాము అనే లైవ్ అప్‌డేట్‌లను పబ్లిక్ సోషల్ మీడియా ఖాతాలలో.. షేర్ చేయడం మానుకోవాలి. ఇది మీ కదలికలను ఇతరులు గమనించడానికి అవకాశం ఇస్తుంది.

మొబైల్ ఫోన్ :

ప్రస్తుత కాలంలో మన చేతిలో ఉండే స్మార్ట్‌ ఫోన్ కేవలం కాలక్షేపం కోసమే కాదు. అత్యవసర సమయాల్లో.. మనల్ని రక్షించే రక్షణ కవచంలా పని చేస్తుంది. దీనిని సరిగ్గా ఎలా వాడాలంటే..

SOS ఫీచర్లు, సేఫ్టీ యాప్స్:

మీ ఫోన్‌లో ఉండే SOS ఎమర్జెన్సీ బటన్‌ను సెట్ చేసుకోండి. తెలంగాణ పోలీసుల ‘టెన్ ఆప్స్’ లేదా ఇతర ఉమెన్ సేఫ్టీ యాప్స్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఒకే క్లిక్‌తో పోలీసులకు సమాచారం వెళ్తుంది.

లైవ్ లొకేషన్ షేరింగ్:

మీ కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితులకు మీ వాట్సాప్ ద్వారా ‘లైవ్ లొకేషన్’షేర్ చేసి ఉంచండి. దీని వల్ల మీరు ఎక్కడ ఉన్నారో ఎప్పటికప్పుడు వారికి తెలుస్తుంది.

Also Read; ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఫేక్ కాల్ యాప్స్:

ఒకవేళ ప్రయాణంలో.. అనుమానాస్పద వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తే.. ఫోన్‌లో ‘ఫేక్ కాల్’ యాప్స్ ద్వారా ఎవరో మీకు కాల్ చేస్తున్నట్లు నటించొచ్చు లేదా పోలీసులకు డైరెక్ట్ 112 నంబర్‌కు కాల్ చేయెచ్చు.

భయం అనేది మనల్ని బలహీనపరుస్తుంది. కానీ అప్రమత్తత మనల్ని కాపాడుతుంది. రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, మొబైల్ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకుంటే.. ఏ మహిళైనా నిర్భయంగా, సేఫ్ గా తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు!

Related News

స్లీపర్ బస్సుల్లో వరుస అగ్నిప్రమాదాలు..బస్సులో మంటలు చెలరేగితే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?

కటింగ్ బోర్డును కేవలం నీటితో కడుగుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!

వివాహ బంధంలో సమస్యలు.. విడాకుల పరిస్థితి నివారించడానికి 7 సూత్రాలు

స్టైలిష్‌గా కనిపించేందుకు బ్రాండెడ్ డ్రెస్‌ అవసరం లేదు.. తక్కువ బడ్జెట్‌లో ఫ్యాషన్ టిప్స్

“నాకు అదృష్టం లేదు”.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ తమ వైఫల్యాలకు విధిని నిందిస్తారు

మీ వయసు పదేళ్లు తగ్గిపోతుంది.. నిత్యయవ్వన చర్మం కోసం ఈ 7 సూపర్ జ్యూస్‌లు తాగండి

డోపమైన్ కోసం డేటింగ్.. ప్రేమలో కొత్తదనం కోరుకుంటున్న జెన్ జీ యువత

Big Stories

Advertisement
×