E-Paper
Advertisement

25 ఏళ్లుగా పిచ్చి పనులతో నవ్వించిన గ్యాంగ్… ఈసారి చేసే రచ్చే చివరిదా?

25 ఏళ్లుగా పిచ్చి పనులతో నవ్వించిన గ్యాంగ్… ఈసారి చేసే రచ్చే చివరిదా?
Advertisement

Comedy Movie: పిచ్చి పనులు చేయడం, ప్రమాదకరమైన స్టంట్స్‌తో షాక్ ఇవ్వడం, వాటినే కామెడీగా మార్చి ప్రేక్షకులను నవ్వించడం ‘Jackass’ గ్యాంగ్ స్టైల్. దాదాపు 25 ఏళ్లుగా ఈ క్రేజీ గ్యాంగ్ చేసే రచ్చకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అదే గ్యాంగ్ మరోసారి కలసి చివరి రైడ్‌కు సిద్ధమైంది. ‘Jackass: Best and Last’లో జానీ నాక్స్‌విల్, స్టీవ్-ఓ, క్రిస్ పాంటియస్, వీ మాన్, డేవ్ ఇంగ్లండ్, డేంజర్ ఎహ్రెన్, ప్రెస్టన్ లేసీతో పాటు ఇతర సభ్యులు తిరిగి వచ్చారు. ఈసారి కూడా కొత్త స్టంట్స్, పిచ్చి ప్రాంక్స్‌తో పాటు గత 25 ఏళ్లలో అభిమానులను విపరీతంగా నవ్వించిన హైలైట్స్‌ను కలిపి చూపించారు. జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫ్రాంచైజ్‌కు ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా Paramount పేర్కొంది. మరి ఈసారి గ్యాంగ్ ఎలాంటి స్టంట్స్ చేసింది? పాత క్రేజీ మూమెంట్స్‌లో ఏవి మళ్లీ చూపించారు? నిజంగానే ఇదే వీళ్ల చివరి రైడా? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

‘Jackass’కు సాధారణ సినిమాల్లా ప్రత్యేకమైన కథ ఉండదు. జానీ నాక్స్‌విల్ అండ్ గ్యాంగ్ తమ శరీరాలను రిస్క్‌లో పెట్టే విచిత్రమైన స్టంట్స్, ప్రాంక్స్, సిల్లీ ఛాలెంజ్‌లతోనే అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌ను పంచుతారు. ఈ ఫైనల్ మూవీ కూడా అదే ఫార్ములాను కొనసాగిస్తుంది. కొత్తగా షూట్ చేసిన స్టంట్స్‌తో పాటు గత 25 ఏళ్లలోని గుర్తుండిపోయే మూమెంట్స్, ఇంతకుముందు చూడని ఫుటేజ్‌ను కలిపి చూపించారు.

Advertisement

జానీ, స్టీవ్-ఓ, క్రిస్ పాంటియస్, వీ మాన్, డేవ్ ఇంగ్లండ్, ఎహ్రెన్ తదితరులు మరోసారి కలిసి చేసే ప్రతి స్టంట్ వెనుక వాళ్ల స్నేహం, ఒకరిపై ఒకరు వేసుకునే ప్రాంక్స్ కనిపిస్తాయి. అయితే వయసు పెరిగినా ఈ గ్యాంగ్‌లోని పిచ్చి మాత్రం తగ్గలేదనేలా సినిమా సాగుతుంది. కొత్త తరం సభ్యులు కూడా తమదైన స్టంట్స్‌తో రచ్చలో భాగమవుతారు. గత సినిమాల ఫ్యాన్స్‌కు నాస్టాల్జియా, కొత్త ప్రేక్షకులకు క్రేజీ కామెడీ అందించేలా పాతవి-కొత్తవి కలిపారు.

ఎక్కడ చూడచ్చు అంటే ?

జెఫ్ ట్రెమైన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జానీ నాక్స్‌విల్, స్టీవ్-ఓ, క్రిస్ పాంటియస్, జాసన్ ‘వీ మాన్’ అక్యూనా, డేవ్ ఇంగ్లండ్, ఎహ్రెన్ మెక్‌గెహీ, ప్రెస్టన్ లేసీ, రేచల్ వోల్ఫ్‌సన్, పూపీస్ తదితరులు కనిపించారు. సినిమా నిడివి సుమారు 1 గంట 32 నిమిషాలు. ఇది కామెడీ, డాక్యుమెంటరీ తరహా స్టంట్ ఎంటర్‌టైనర్. సెప్టెంబర్ 24 నుంచి Paramount+లో స్ట్రీమింగ్ అవుతోంది.  స్టంట్ కామెడీ, పిచ్చి ప్రాంక్స్, బ్లాక్ హ్యూమర్, నాన్‌స్టాప్ రచ్చ ఇష్టపడేవారికి ‘Jackass: Best and Last’ ఫుల్ క్రేజీ రైడ్.

Advertisement

Read Also: చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

Tags

Related News

ఉద్యోగం కోసం ఇరాక్‌కు వెళ్లిన అమ్మాయి… ఊహించని పరిస్థితుల్లో ఉగ్రవాదుల చెరలో… నరాలు కట్టయ్యే సర్వైవల్ థ్రిల్లర్

60 ఏళ్ల వయసులో తన చిన్ననాటి రూపమే ఎదురైతే… గత జ్ఞాపకాలతో మొదలయ్యే అద్భుత ప్రయాణం… ఎమోషనల్ ఫాంటసీ యానిమేషన్

నాని ది ప్యారడైజ్ వచ్చేది ఈ ఓటీటీలోనే…స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

9 ఏళ్లుగా కనిపించని కూతురు కోసం తల్లి వెతుకులాట… దొరికిందనుకున్న వేళ చుట్టూ అనుమానితులు… గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్

ఓటీటీలోకి నయనతార ‘హాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ఫుట్‌బాల్ స్టార్ కెరీర్‌కు బ్రేక్… డ్యాన్సర్ గర్ల్‌ఫ్రెండ్‌కు కొత్త కష్టాలు… రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×